న్యాచురల్ యాక్టింగ్తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అందం, ఆస్తి, హోదా కంటే వ్యక్తిత్వం, మంచి మనసు, ఆలోచనా విధానానికే తాను ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించింది. తన జీవిత భాగస్వామి స్వార్థపూరితంగా ఉండకూడదని, చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే పరిణతి ఉండాలని సాయి పల్లవి చెప్పింది. తప్పులకు ఇతరులను నిందించకుండా బాధ్యత తీసుకునే నిజాయితీ ఉండాలని తెలిపింది. అంతేకాకుండా, సరదాగా తనకు కాబోయే భర్తకు వంట చేయడం కూడా వచ్చి ఉండాలని పేర్కొంది.
