ప్రభన్యూస్

జెన్ జీ కోసం యెస్ బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్… రూ.22,000 వరకు బెనిఫిట్స్, సర్వీస్ ఛార్జీలు జీరో! | బిజినెస్


Last Updated:

యువత అవసరాలకు తగ్గట్టుగా యెస్ బ్యాంక్ ‘యెస్ వైబ్జ్’ పేరుతో కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. ఇందులో రూ.22,000 వరకు ప్రయోజనాలు, డెబిట్ కార్డుపై రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్, యూపీఐ చెల్లింపులపై రివార్డులు, ఏడాది పాటు జీరో బ్రోకరేజ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జెన్ జీ కోసం యెస్ బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్... రూ.22,000 వరకు బెనిఫిట్స్, సర్వీస్ ఛార్జీలు జీరో!
జెన్ జీ కోసం యెస్ బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్… రూ.22,000 వరకు బెనిఫిట్స్, సర్వీస్ ఛార్జీలు జీరో!

యువత అవసరాలకు తగ్గట్టుగా యెస్ బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ‘యెస్ వైబ్జ్’ (YES vibez). సర్వీస్ ఛార్జీలు లేకపోవడం, యూపీఐ చెల్లింపులపై రివార్డులు, డెబిట్ కార్డుపై క్యాష్‌బ్యాక్, డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు ఈ అకౌంట్ ప్రత్యేకతలు. అంతేకాదు, అకౌంట్ తెరిచినప్పుడు రూ.22,000 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా జనరేషన్ జెడ్ (Gen Z) యువత జీవనశైలి, ఖర్చులు, డిజిటల్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ దీన్ని రూపొందించింది. నేటి యువత ఆలోచనా విధానం, జీవనశైలి గత తరాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటున్నాయి. కొందరు తమకు ఇష్టమైన పనులను చిన్న వ్యాపారాలుగా మార్చుకుంటున్నారు. మరికొందరికి అర్ధరాత్రి వచ్చే ఆలోచనలు కొత్త ప్రయత్నాలకు దారితీస్తున్నాయి. ఇంకొందరు ఉద్యోగంలో ఉంటూనే తమ కెరీర్‌ను మార్చుకుంటున్నారు. ఒకేసారి ఐదు రకాల పనులు ప్రయత్నించి, నచ్చని రెండింటిని మధ్యలోనే వదిలేస్తున్నారు.

భారత్‌లో నేటి తరం యువత సంఖ్య దాదాపు 40.7 కోట్లు (407 మిలియన్లు). వీరినే జనరేషన్ జెడ్ లేదా జెన్ జీ అంటారు. వీరిలో చాలామంది కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఉద్యోగంతో పాటు తమకు ఇష్టమైన పనులపైనా దృష్టి పెడుతున్నారు. ప్రయాణాలు చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటి పనుల్లో ఆసక్తి చూపిస్తున్నారు. తమకు నచ్చిన విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ తరం జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని యెస్ బ్యాంక్ ‘యెస్ వైబ్జ్’ పేరుతో ప్రత్యేక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించింది. ఎప్పుడూ ప్రయాణాల్లో ఉండే, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇచ్చే యువత అవసరాలకు తగ్గట్టుగా దీన్ని రూపొందించారు. మారుతున్న ఖర్చుల అలవాట్లు, జీవనశైలి, వేగంగా సేవలు పొందాలనే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ అకౌంట్‌లో పలు ప్రయోజనాలు అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Special Trains: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ స్పెషల్ రైళ్లలో 12,400కు పైగా బెర్తులు… వెంటనే బుక్ చేసుకోండి!

యెస్ వైబ్జ్ అకౌంట్‌లో సర్వీస్ ఛార్జీలు ఉండవు. అకౌంట్ ప్రారంభించినప్పుడు రూ.22,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. యెస్ సెక్యూరిటీస్ ద్వారా డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లను ఉచితంగా పొందే అవకాశం ఉంది. వీటిపై ఏడాది పాటు బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఉండవు. డెబిట్ కార్డుతో చేసే ఖర్చులపై రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వ్యాపార సంస్థలకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు రూ.3,000 వరకు రివార్డులు అందుతాయి. సినిమాలు చూడటం, బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం వంటి వినోద కార్యక్రమాలపైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సాధారణ ఖర్చులపైనా అదనపు ప్రయోజనాలు పొందేలా ఈ అకౌంట్‌ను రూపొందించారు.

ఈ అకౌంట్‌లో భాగంగా కస్టమర్లకు వివిధ స్థాయులకు తగ్గట్టుగా మరిన్ని ప్రయోజనాలు అందించే డెబిట్ కార్డులు కూడా ఉంటాయి. సాధారణ కస్టమర్ల నుంచి ఎక్కువ ఆదాయం ఉన్నవారి వరకు వేర్వేరు విభాగాలకు అనుగుణంగా ఈ ప్రయోజనాలు మారుతాయి. యెస్ బ్యాంక్ రిఫ్లెక్షన్ డెబిట్ కార్డు ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన డిస్‌ప్లే పిక్చర్ (డీపీ)ని ఎంచుకోవచ్చు. అంటే కార్డుపై కనిపించే ఫొటోను తమ ఇష్టానికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. యెస్ బ్యాంక్ హెల్త్‌ఫిట్ డెబిట్ కార్డు ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో జిమ్‌కు వెళ్లే సదుపాయం, ఆరోగ్య పరీక్షలు, ఫార్మసీ ప్రయోజనాలు ఉంటాయి. వీటితో పాటు యెస్ వైబ్జ్ కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఆధారంగా క్రెడిట్ కార్డును కూడా పొందొచ్చు. ఈ కార్డుపై మొదటి ఏడాది ఎలాంటి ఛార్జీలు ఉండవు.

ఇది కూడా చదవండి: Farmer News: ఈ పంట పండిస్తే లక్షకు లక్ష ఆదాయం… కేంద్రం ప్రకటించిన కొత్త ధర ఎంతంటే

ఎఫ్‌డీ ఆధారంగా క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల యువత తమ క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది. సరైన పద్ధతిలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ, చెల్లింపులను సమయానికి చేస్తే భవిష్యత్తులో రుణాలు తీసుకునేటప్పుడు ఉపయోగపడే క్రెడిట్ చరిత్రను ఏర్పరచుకోవచ్చు. యెస్ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్, ఫీజు అండ్ బిజినెస్ బ్యాంకింగ్ విభాగం కంట్రీ హెడ్ ధీరజ్ సంఘీ మాట్లాడుతూ.. డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధారంగా కొత్త బ్యాంకింగ్ సేవలను అందించడం యెస్ బ్యాంక్ వ్యూహంలో ఎప్పటినుంచో కీలకంగా ఉందని చెప్పారు. నేటి తరం కోసం ప్రత్యేకంగా యెస్ వైబ్జ్‌ను తీసుకురావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వేగంగా మారుతున్న ఈ తరం డిజిటల్ సేవలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని, తమ అనుభవాలకు విలువ ఇస్తుందని, చేసిన పనికి వెంటనే గుర్తింపు కోరుకుంటుందని వివరించారు.

ఇది కూడా చదవండి: Car Loan Offer: దీపావళికి కారు కొనే ప్లాన్ ఉందా? ఈ బ్యాంకుల ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!

యువత రోజువారీ జీవితాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చడంతో పాటు, తమ కెరీర్ ప్రారంభ దశ నుంచే బాధ్యతాయుతమైన ఆర్థిక అలవాట్లను పెంచుకునేందుకు ఈ అకౌంట్ ఉపయోగపడేలా రూపొందించినట్టు ఆయన చెప్పారు. భవిష్యత్తులో దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోయే కొత్త తరంతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడం తమ లక్ష్యమని తెలిపారు. యెస్ వైబ్జ్ ప్రారంభం ద్వారా కొత్త తరం అవసరాలకు తగ్గట్టుగా బ్యాంకింగ్ సేవలను అందించాలన్న తమ నిబద్ధతను యెస్ బ్యాంక్ మరోసారి చాటింది. అందరికీ ఒకే రకమైన జీవనశైలి ఉండదని, ప్రతి ఒక్కరి అవసరాలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయని ఈ అకౌంట్ రూపకల్పనలో దృష్టిలో పెట్టుకున్నారు.

మొదటి జీతం అందుకున్న దగ్గర్నుంచి సొంత స్టార్టప్ ప్రారంభించే వరకు, చిన్న ప్రాజెక్టుగా మొదలైన పనిని పూర్తిస్థాయి కెరీర్‌గా మార్చుకునే వరకు యువత ప్రయాణంలో తోడుగా ఉండటమే యెస్ వైబ్జ్ లక్ష్యమని బ్యాంక్ తెలిపింది. యువతకు ముఖ్యమైన విషయాలకే తమ బ్యాంక్ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 6:33 pm Digital Edition : Prabhanews
జెన్ జీ కోసం యెస్ బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్… రూ.22,000 వరకు బెనిఫిట్స్, సర్వీస్ ఛార్జీలు జీరో! | బిజినెస్

Last Updated:Oct 29, 2026 6:17 PM ISTయువత అవసరాలకు తగ్గట్టుగా యెస్ బ్యాంక్ 'యెస్ వైబ్జ్' పేరుతో కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. ఇందులో రూ.22,000 వరకు ప్రయోజనాలు, డెబిట్ కార్డుపై రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్, యూపీఐ చెల్లింపులపై రివార్డులు, ఏడాది పాటు జీరో బ్రోకరేజ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.జెన్ జీ కోసం యెస్ బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్... రూ.22,000 వరకు బెనిఫిట్స్, సర్వీస్ ఛార్జీలు జీరో! యువత అవసరాలకు తగ్గట్టుగా యెస్ బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చింది. దీని పేరు 'యెస్ వైబ్జ్' (YES vibez). సర్వీస్ ఛార్జీలు లేకపోవడం, యూపీఐ చెల్లింపులపై రివార్డులు, డెబిట్ కార్డుపై క్యాష్‌బ్యాక్, డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు ఈ అకౌంట్ ప్రత్యేకతలు. అంతేకాదు, అకౌంట్ తెరిచినప్పుడు రూ.22,000 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా జనరేషన్ జెడ్ (Gen Z) యువత జీవనశైలి, ఖర్చులు, డిజిటల్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ దీన్ని రూపొందించింది. నేటి యువత ఆలోచనా విధానం, జీవనశైలి గత తరాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటున్నాయి. కొందరు తమకు ఇష్టమైన పనులను చిన్న వ్యాపారాలుగా మార్చుకుంటున్నారు. మరికొందరికి అర్ధరాత్రి వచ్చే ఆలోచనలు కొత్త ప్రయత్నాలకు దారితీస్తున్నాయి. ఇంకొందరు ఉద్యోగంలో ఉంటూనే తమ కెరీర్‌ను మార్చుకుంటున్నారు. ఒకేసారి ఐదు రకాల పనులు ప్రయత్నించి, నచ్చని రెండింటిని మధ్యలోనే వదిలేస్తున్నారు.భారత్‌లో నేటి తరం యువత సంఖ్య దాదాపు 40.7 కోట్లు (407 మిలియన్లు). వీరినే జనరేషన్ జెడ్ లేదా జెన్ జీ అంటారు. వీరిలో చాలామంది కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఉద్యోగంతో పాటు తమకు ఇష్టమైన పనులపైనా దృష్టి పెడుతున్నారు. ప్రయాణాలు చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటి పనుల్లో ఆసక్తి చూపిస్తున్నారు. తమకు నచ్చిన విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ తరం జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని యెస్ బ్యాంక్ 'యెస్ వైబ్జ్' పేరుతో ప్రత్యేక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించింది. ఎప్పుడూ ప్రయాణాల్లో ఉండే, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇచ్చే యువత అవసరాలకు తగ్గట్టుగా దీన్ని రూపొందించారు. మారుతున్న ఖర్చుల అలవాట్లు, జీవనశైలి, వేగంగా సేవలు పొందాలనే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ అకౌంట్‌లో పలు ప్రయోజనాలు అందిస్తున్నారు.ఇది కూడా చదవండి: Special Trains: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ స్పెషల్ రైళ్లలో 12,400కు పైగా బెర్తులు... వెంటనే బుక్ చేసుకోండి!యెస్ వైబ్జ్ అకౌంట్‌లో సర్వీస్ ఛార్జీలు ఉండవు. అకౌంట్ ప్రారంభించినప్పుడు రూ.22,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. యెస్ సెక్యూరిటీస్ ద్వారా డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లను ఉచితంగా పొందే అవకాశం ఉంది. వీటిపై ఏడాది పాటు బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఉండవు. డెబిట్ కార్డుతో చేసే ఖర్చులపై రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వ్యాపార సంస్థలకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు రూ.3,000 వరకు రివార్డులు అందుతాయి. సినిమాలు చూడటం, బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం వంటి వినోద కార్యక్రమాలపైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సాధారణ ఖర్చులపైనా అదనపు ప్రయోజనాలు పొందేలా ఈ అకౌంట్‌ను రూపొందించారు.ఈ అకౌంట్‌లో భాగంగా కస్టమర్లకు వివిధ స్థాయులకు తగ్గట్టుగా మరిన్ని ప్రయోజనాలు అందించే డెబిట్ కార్డులు కూడా ఉంటాయి. సాధారణ కస్టమర్ల నుంచి ఎక్కువ ఆదాయం ఉన్నవారి వరకు వేర్వేరు విభాగాలకు అనుగుణంగా ఈ ప్రయోజనాలు మారుతాయి. యెస్ బ్యాంక్ రిఫ్లెక్షన్ డెబిట్ కార్డు ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన డిస్‌ప్లే పిక్చర్ (డీపీ)ని ఎంచుకోవచ్చు. అంటే కార్డుపై కనిపించే ఫొటోను తమ ఇష్టానికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. యెస్ బ్యాంక్ హెల్త్‌ఫిట్ డెబిట్ కార్డు ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో జిమ్‌కు వెళ్లే సదుపాయం, ఆరోగ్య పరీక్షలు, ఫార్మసీ ప్రయోజనాలు ఉంటాయి. వీటితో పాటు యెస్ వైబ్జ్ కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఆధారంగా క్రెడిట్ కార్డును కూడా పొందొచ్చు. ఈ కార్డుపై మొదటి ఏడాది ఎలాంటి ఛార్జీలు ఉండవు.ఇది కూడా చదవండి: Farmer News: ఈ పంట పండిస్తే లక్షకు లక్ష ఆదాయం... కేంద్రం ప్రకటించిన కొత్త ధర ఎంతంటేఎఫ్‌డీ ఆధారంగా క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల యువత తమ క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది. సరైన పద్ధతిలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ, చెల్లింపులను సమయానికి చేస్తే భవిష్యత్తులో రుణాలు తీసుకునేటప్పుడు ఉపయోగపడే క్రెడిట్ చరిత్రను ఏర్పరచుకోవచ్చు. యెస్ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్, ఫీజు అండ్ బిజినెస్ బ్యాంకింగ్ విభాగం కంట్రీ హెడ్ ధీరజ్ సంఘీ మాట్లాడుతూ.. డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధారంగా కొత్త బ్యాంకింగ్ సేవలను అందించడం యెస్ బ్యాంక్ వ్యూహంలో ఎప్పటినుంచో కీలకంగా ఉందని చెప్పారు. నేటి తరం కోసం ప్రత్యేకంగా యెస్ వైబ్జ్‌ను తీసుకురావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వేగంగా మారుతున్న ఈ తరం డిజిటల్ సేవలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని, తమ అనుభవాలకు విలువ ఇస్తుందని, చేసిన పనికి వెంటనే గుర్తింపు కోరుకుంటుందని వివరించారు.ఇది కూడా చదవండి: Car Loan Offer: దీపావళికి కారు కొనే ప్లాన్ ఉందా? ఈ బ్యాంకుల ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!యువత రోజువారీ జీవితాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చడంతో పాటు, తమ కెరీర్ ప్రారంభ దశ నుంచే బాధ్యతాయుతమైన ఆర్థిక అలవాట్లను పెంచుకునేందుకు ఈ అకౌంట్ ఉపయోగపడేలా రూపొందించినట్టు ఆయన చెప్పారు. భవిష్యత్తులో దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోయే కొత్త తరంతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడం తమ లక్ష్యమని తెలిపారు. యెస్ వైబ్జ్ ప్రారంభం ద్వారా కొత్త తరం అవసరాలకు తగ్గట్టుగా బ్యాంకింగ్ సేవలను అందించాలన్న తమ నిబద్ధతను యెస్ బ్యాంక్ మరోసారి చాటింది. అందరికీ ఒకే రకమైన జీవనశైలి ఉండదని, ప్రతి ఒక్కరి అవసరాలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయని ఈ అకౌంట్ రూపకల్పనలో దృష్టిలో పెట్టుకున్నారు.మొదటి జీతం అందుకున్న దగ్గర్నుంచి సొంత స్టార్టప్ ప్రారంభించే వరకు, చిన్న ప్రాజెక్టుగా మొదలైన పనిని పూర్తిస్థాయి కెరీర్‌గా మార్చుకునే వరకు యువత ప్రయాణంలో తోడుగా ఉండటమే యెస్ వైబ్జ్ లక్ష్యమని బ్యాంక్ తెలిపింది. యువతకు ముఖ్యమైన విషయాలకే తమ బ్యాంక్ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంది.మరింత చదవండి

Source link