చిన్నగా ఉన్న మొక్కకు ఉప్పు, సున్నం, పసుపుతో తయారు చేసిన మిశ్రమాన్ని ఉపయోగించే పద్ధతిని సూచించారు. ఒక గ్లాసు నీటిలో ఒక్కో చెంచా ఉప్పు, సున్నం, పసుపు కలిపి మొక్క చుట్టూ, అది మొలిచిన పగుళ్లలో వేయవచ్చని పేర్కొంది. ఈ మిశ్రమం మొక్కలోని తేమను తగ్గించి, వేర్ల చుట్టూ పరిస్థితులను మార్చడం ద్వారా మొక్క ఎండిపోయేలా చేస్తుందని చెబుతున్నారు. అయితే మొక్క పరిమాణం, వయసు, వేర్ల స్థితి, అక్కడి తేమను బట్టి ఫలితం మారవచ్చు. కాబట్టి ప్రతి సందర్భంలో ఇదే విధంగా పనిచేస్తుందని హామీ ఇవ్వలేం.

