ప్రభన్యూస్

Chiranjeevi Megaverse: చిరంజీవి ‘మెగావర్స్’ టాక్ షో, అఫీషియల్‌గా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

వెండితెరపై దశాబ్దాలుగా తిరుగులేని మెగాస్టార్‌గా తనదైన నటనతో బాక్సాఫీస్‌ను ఏలుతున్న చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

News18
News18

వెండితెరపై దశాబ్దాలుగా తిరుగులేని మెగాస్టార్‌గా తనదైన నటనతో బాక్సాఫీస్‌ను ఏలుతున్న చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఆయన ఓ భారీ టాక్ షోను హోస్ట్ చేయనున్నారంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటనతో తెరపడింది. ఈ ప్రతిష్టాత్మక టాక్ షోకి ‘మెగావర్స్’ (Megaverse) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

“మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ వచ్చేస్తున్నారు” అంటూ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. ఒక భారీ ఇండస్ట్రియల్ సెటప్ మధ్యలో ఉన్న కుర్చీని హైలైట్ చేస్తూ, ‘మెగావర్స్’ టైటిల్ మధ్యలో చిరంజీవి షాడో ఇమేజ్‌ను డిజైన్ చేసిన తీరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ స్పెషల్ టాక్ షోకి చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం. మొత్తం 12 నుంచి 15 ఎపిసోడ్స్‌తో ఈ షో మొదటి సీజన్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ షో షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత భారీ సెట్‌లో ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌ను ఆద్యంతం వినోదాత్మకంగా అందించేందుకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, కమెడియన్లు సునీల్, సత్యలతో చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు రాబోయే ఎపిసోడ్లలో పాన్ ఇండియా స్టార్స్, దిగ్గజ నటులు సందడి చేయనున్నారు. ముఖ్యంగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ షోలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలతో పాటు చిరంజీవి తన సినీ, రాజకీయ, నిజ జీవిత అనుభవాలను పంచుకోనున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఓటీటీ/బుల్లితెర హోస్టులుగా మారడం కొత్త ట్రెండ్ కాదు. నాగార్జున (బిగ్ బాస్), బాలకృష్ణ (అన్‌స్టాపబుల్), జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా వంటి వారు హోస్టులుగా తమ సత్తా చాటారు. ముఖ్యంగా ఆహా కోసం బాలయ్య చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో ఓటీటీ టాక్ షోలలో సంచలన విజయం సాధించింది. గతంలో చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోకి ఒక సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పటికీ.. అది ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. కానీ, ఇప్పుడు ‘మెగావర్స్’ ఒక పూర్తి స్థాయి సెలబ్రిటీ టాక్ షో కావడం, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్ పై వస్తుండటంతో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్, ఛరిష్మాతో ఈ షోను ఎలా నడిపిస్తారో చూడాలని అటు సినీ వర్గాలతో పాటు ఇటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 10:38 pm Digital Edition : Prabhanews
Chiranjeevi Megaverse: చిరంజీవి ‘మెగావర్స్’ టాక్ షో, అఫీషియల్‌గా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 29, 2026 10:33 PM ISTవెండితెరపై దశాబ్దాలుగా తిరుగులేని మెగాస్టార్‌గా తనదైన నటనతో బాక్సాఫీస్‌ను ఏలుతున్న చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
News18వెండితెరపై దశాబ్దాలుగా తిరుగులేని మెగాస్టార్‌గా తనదైన నటనతో బాక్సాఫీస్‌ను ఏలుతున్న చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఆయన ఓ భారీ టాక్ షోను హోస్ట్ చేయనున్నారంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటనతో తెరపడింది. ఈ ప్రతిష్టాత్మక టాక్ షోకి ‘మెగావర్స్’ (Megaverse) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు."మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ వచ్చేస్తున్నారు" అంటూ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. ఒక భారీ ఇండస్ట్రియల్ సెటప్ మధ్యలో ఉన్న కుర్చీని హైలైట్ చేస్తూ, 'మెగావర్స్' టైటిల్ మధ్యలో చిరంజీవి షాడో ఇమేజ్‌ను డిజైన్ చేసిన తీరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ స్పెషల్ టాక్ షోకి చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం. మొత్తం 12 నుంచి 15 ఎపిసోడ్స్‌తో ఈ షో మొదటి సీజన్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ షో షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత భారీ సెట్‌లో ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌ను ఆద్యంతం వినోదాత్మకంగా అందించేందుకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, కమెడియన్లు సునీల్, సత్యలతో చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు రాబోయే ఎపిసోడ్లలో పాన్ ఇండియా స్టార్స్, దిగ్గజ నటులు సందడి చేయనున్నారు. ముఖ్యంగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ షోలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలతో పాటు చిరంజీవి తన సినీ, రాజకీయ, నిజ జీవిత అనుభవాలను పంచుకోనున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోలు ఓటీటీ/బుల్లితెర హోస్టులుగా మారడం కొత్త ట్రెండ్ కాదు. నాగార్జున (బిగ్ బాస్), బాలకృష్ణ (అన్‌స్టాపబుల్), జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా వంటి వారు హోస్టులుగా తమ సత్తా చాటారు. ముఖ్యంగా ఆహా కోసం బాలయ్య చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షో ఓటీటీ టాక్ షోలలో సంచలన విజయం సాధించింది. గతంలో చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షోకి ఒక సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పటికీ.. అది ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. కానీ, ఇప్పుడు 'మెగావర్స్' ఒక పూర్తి స్థాయి సెలబ్రిటీ టాక్ షో కావడం, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్ పై వస్తుండటంతో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్, ఛరిష్మాతో ఈ షోను ఎలా నడిపిస్తారో చూడాలని అటు సినీ వర్గాలతో పాటు ఇటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన రానుంది.మరింత చదవండి

Source link