Last Updated:
నిద్రలో ఉన్న పసిబిడ్డ ఒక్కసారిగా నవ్వితే.. ఏదో అందమైన కల కంటోందని మీరు కూడా అనుకుంటున్నారా? మరి నిద్రలోనే ఏడుస్తున్నట్టుగా శబ్దాలు చేస్తే? అసలు ఈ చిన్నారుల నిద్రలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు.
నవజాత శిశువు నిద్రలో ఉండగా ఒక్కసారిగా చిరునవ్వు చిందించడం, పెదవులు కదపడం లేదా చిన్నగా శబ్దం చేయడం తల్లిదండ్రుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు బిడ్డ ముఖంలో ఏడుస్తున్నట్టుగా భావం కనిపించి, కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ప్రశాంతంగా నిద్రపోతుంది. దీంతో కొత్తగా తల్లిదండ్రులైన వారిలో ‘బిడ్డ ఏదైనా కల కంటుందా?’, ‘ఏమైనా ఇబ్బంది పడుతోందా?’ అనే సందేహాలు రావడం సహజం. అయితే నవజాత శిశువుల నిద్ర విధానం పెద్దల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నిద్రలో కనిపించే ప్రతి నవ్వు లేదా వినిపించే ప్రతి శబ్దం తప్పనిసరిగా ఏదైనా ప్రత్యేకమైన కలకు సంకేతం కావాల్సిన అవసరం లేదు.

