ప్రభన్యూస్

Mandadi Movie: జాక్ పాట్ కొట్టేసిన ‘మండాడి’ నిర్మాత.. దిమ్మతిరిగే రేంజ్‌లో ఓటీటీ రైట్స్.. తంతే బూరలో బుట్టలో పడ్డాడుగా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

లాస్ట్ వీక్ రిలీజైన మండాడి సినిమాకు యునానిమస్‌గా హిట్ టాక్ వచ్చింది. మతిమారణ్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రిలీజైంది. రెండు భాషల్లోనూ ఈ సినిమాకు ఫుల్ పాజిటీవ్ టాక్ వచ్చింది.

News18
News18

లాస్ట్ వీక్ రిలీజైన మండాడి సినిమాకు యునానిమస్‌గా హిట్ టాక్ వచ్చింది. మతిమారణ్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రిలీజైంది. రెండు భాషల్లోనూ ఈ సినిమాకు ఫుల్ పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా బీభత్సంగా వస్తున్నాయి. కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టింది. తెలుగులో ఈ సినిమా రూ.4.5 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.4 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకొక రూ.50 లక్షలు కలెక్ట్ చేస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.

ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగగా.. ఇప్పటి వరకు రూ.28 కోట్ల వరకు షేర్ సాధించి.. ఆల్రెడీ రూ.6 కోట్ల లాభాల్లోకి వచ్చారు. తంతే బూరల బుట్టలో పడ్డట్లు ఈ సినిమా నిర్మాత ఓ వైపు థియేట్రికల్ పరంగా లాభాల్లోకి వస్తే.. మరోవైపు ఓటీటీ డీల్‌ కూడా ఊహించని రేంజ్‌లో వచ్చిందట. ఈ సినిమాకు దాదాపు రూ.45 కోట్ల వరకు బడ్జెట్ అయిందని సమాచారం. దాంతో రూ.20 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మగా.. మిగిలిన పాతిక కోట్లను డిజిటల్ రైట్స్ నుంచి తెచ్చుకోవాలని నిర్మాత ప్లాన్ చేశాడు.

దాంతో నెట్‌ఫ్లిక్స్‌తో కూర్చొని పాతిక కోట్ల డీల్ మాట్లాడుకున్నాడట. కానీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ మాత్రం రూ.15 కోట్లపైనే కూర్చొందట. ఫైనల్‌గా ఒక అగ్రిమెంట్ ప్రకారం ఓటీటీ డీల్ పూర్తయిందట. ఆ అగ్రిమెంట్ ఏంటంటే.. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి నెట్‌ఫ్లిక్స్ డబ్బులు ఇస్తానని ఒప్పందమీద డీల్ క్లోజ్ చేసుకుంది. ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే.. నెట్‌ఫ్లిక్స్ రూ.30 కోట్లు చెల్లించాలని.. అదే రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల మధ్య కలెక్షన్లు సాధిస్తే.. రూ.40 కోట్లు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకుందట.

కట్ చేస్తే, మండాడి సినిమా ఇప్పటికే రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ప్రొడ్యూసర్ అడిగిన రూ.25 కోట్లకు ఇంకో రూ.15 కోట్లు అధనంగా వచ్చినట్లే. ఈ లెక్కన పెట్టుబడి మొత్తం ఒక ఓటీటీ నుంచే వచ్చింది. ఈ సినిమా లాంగ్ రన్‌లో ఈజీగా రూ.100 కోట్లు క్రాస్ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే.. తంతే బూరల బుట్టలో పడ్డట్లుగా నిర్మాత జాక్ పాట్ కొట్టేశాడు.

సూరీ, సుహాస్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమాలో ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించాడు. ఈ సినిమా కథ మొత్తం శ్రీకాకుళంలోని కళింగపట్నం తీరంలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో ప్రతీ ఏడాది తెరచాప పడవ పందాలు జరుగుతుంటాయి. అక్కడ జరిగే తెరచాప పడవ పందాల్లో ముత్తుకాళి అలియాస్ కాళి (సూరి)కి ఎదురుండదు.

అయితే 20 ఏళ్ల క్రితం ఊరిని వదిలి వెళ్లిన కాళి.. మల్లేష్‌ అనే యువకుడి కోసం తిరిగి కళింగపట్నంలో అడుగుపెడతాడు. అప్పటికే ఆ ప్రాంతాన్ని సాట్టా పులి (సుహాస్) శాసిస్తుంటాడు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన కాళి, పులి ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడంతో.. పడవ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లదే కళింగపట్నం అనే సవాల్‌ మొదలవుతుంది. ఈ పోటీలో కాళి గెలిచాడా? వీరిద్దరి మధ్య వైరం ఎందుకు మొదలైంది? అనేదే సినిమా కథ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 5:26 pm Digital Edition : Prabhanews
Mandadi Movie: జాక్ పాట్ కొట్టేసిన ‘మండాడి’ నిర్మాత.. దిమ్మతిరిగే రేంజ్‌లో ఓటీటీ రైట్స్.. తంతే బూరలో బుట్టలో పడ్డాడుగా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 15, 2026 5:24 PM ISTలాస్ట్ వీక్ రిలీజైన మండాడి సినిమాకు యునానిమస్‌గా హిట్ టాక్ వచ్చింది. మతిమారణ్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రిలీజైంది. రెండు భాషల్లోనూ ఈ సినిమాకు ఫుల్ పాజిటీవ్ టాక్ వచ్చింది. News18లాస్ట్ వీక్ రిలీజైన మండాడి సినిమాకు యునానిమస్‌గా హిట్ టాక్ వచ్చింది. మతిమారణ్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రిలీజైంది. రెండు భాషల్లోనూ ఈ సినిమాకు ఫుల్ పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా బీభత్సంగా వస్తున్నాయి. కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టింది. తెలుగులో ఈ సినిమా రూ.4.5 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.4 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకొక రూ.50 లక్షలు కలెక్ట్ చేస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగగా.. ఇప్పటి వరకు రూ.28 కోట్ల వరకు షేర్ సాధించి.. ఆల్రెడీ రూ.6 కోట్ల లాభాల్లోకి వచ్చారు. తంతే బూరల బుట్టలో పడ్డట్లు ఈ సినిమా నిర్మాత ఓ వైపు థియేట్రికల్ పరంగా లాభాల్లోకి వస్తే.. మరోవైపు ఓటీటీ డీల్‌ కూడా ఊహించని రేంజ్‌లో వచ్చిందట. ఈ సినిమాకు దాదాపు రూ.45 కోట్ల వరకు బడ్జెట్ అయిందని సమాచారం. దాంతో రూ.20 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మగా.. మిగిలిన పాతిక కోట్లను డిజిటల్ రైట్స్ నుంచి తెచ్చుకోవాలని నిర్మాత ప్లాన్ చేశాడు.దాంతో నెట్‌ఫ్లిక్స్‌తో కూర్చొని పాతిక కోట్ల డీల్ మాట్లాడుకున్నాడట. కానీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ మాత్రం రూ.15 కోట్లపైనే కూర్చొందట. ఫైనల్‌గా ఒక అగ్రిమెంట్ ప్రకారం ఓటీటీ డీల్ పూర్తయిందట. ఆ అగ్రిమెంట్ ఏంటంటే.. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి నెట్‌ఫ్లిక్స్ డబ్బులు ఇస్తానని ఒప్పందమీద డీల్ క్లోజ్ చేసుకుంది. ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే.. నెట్‌ఫ్లిక్స్ రూ.30 కోట్లు చెల్లించాలని.. అదే రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల మధ్య కలెక్షన్లు సాధిస్తే.. రూ.40 కోట్లు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకుందట.కట్ చేస్తే, మండాడి సినిమా ఇప్పటికే రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ప్రొడ్యూసర్ అడిగిన రూ.25 కోట్లకు ఇంకో రూ.15 కోట్లు అధనంగా వచ్చినట్లే. ఈ లెక్కన పెట్టుబడి మొత్తం ఒక ఓటీటీ నుంచే వచ్చింది. ఈ సినిమా లాంగ్ రన్‌లో ఈజీగా రూ.100 కోట్లు క్రాస్ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే.. తంతే బూరల బుట్టలో పడ్డట్లుగా నిర్మాత జాక్ పాట్ కొట్టేశాడు.సూరీ, సుహాస్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమాలో ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించాడు. ఈ సినిమా కథ మొత్తం శ్రీకాకుళంలోని కళింగపట్నం తీరంలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో ప్రతీ ఏడాది తెరచాప పడవ పందాలు జరుగుతుంటాయి. అక్కడ జరిగే తెరచాప పడవ పందాల్లో ముత్తుకాళి అలియాస్ కాళి (సూరి)కి ఎదురుండదు.అయితే 20 ఏళ్ల క్రితం ఊరిని వదిలి వెళ్లిన కాళి.. మల్లేష్‌ అనే యువకుడి కోసం తిరిగి కళింగపట్నంలో అడుగుపెడతాడు. అప్పటికే ఆ ప్రాంతాన్ని సాట్టా పులి (సుహాస్) శాసిస్తుంటాడు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన కాళి, పులి ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడంతో.. పడవ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లదే కళింగపట్నం అనే సవాల్‌ మొదలవుతుంది. ఈ పోటీలో కాళి గెలిచాడా? వీరిద్దరి మధ్య వైరం ఎందుకు మొదలైంది? అనేదే సినిమా కథ.మరింత చదవండి

Source link