ప్రభన్యూస్

Lara Dutta: ‘రామాయణం’లో కైకేయి లుక్‌పై ట్రోలింగ్.. ఎట్టకేలకు స్పందించిన లారా దత్తా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

News18
News18

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటితో పాటు కైకేయి పాత్రలో నటించిన లారా దత్తా దుస్తులపై కూడా నెటిజన్లు విమర్శలు చేశారు.

ట్రైలర్‌లో లారా దత్తా మెరూన్ కలర్ చీర, గ్రీన్ కలర్ బ్లౌజ్‌లో కనిపించారు. అయితే త్రేతాయుగం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె దుస్తులు చాలా ఆధునికంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేశారు. హిందీ సీరియళ్లలో కనిపించే అత్త పాత్రల మాదిరిగా ఉన్నాయని మరికొందరు ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై గతంలో కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ నరులా తమ ఎంపికను సమర్థించుకున్నారు. తాజాగా లారా దత్తా కూడా ఈ విషయంపై తొలిసారి స్పందించారు.

తన దుస్తులపై వస్తున్న విమర్శల గురించి ఆమె మాట్లాడుతూ.. సినిమా కోసం ఎలాంటి దుస్తులు ఎంచుకున్నామో, వాటిని తెరపై ఎలా చూపించాలనుకున్నామో దాని వెనుక ఒక కారణం ఉందని చెప్పారు. ఇంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలను పట్టుకుని విమర్శించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

దర్శకుడు నితేశ్ తివారీతో జరిగిన చర్చలను కూడా లారా గుర్తుచేసుకున్నారు. కైకేయి కేకయ రాజ్యానికి చెందిన యువరాణి కాబట్టి ఆమె ఆభరణాలు, దుస్తులు మిగతా ఇద్దరు రాణులైన కౌసల్య, సుమిత్రల కంటే భిన్నంగా ఉండకూడదా? తన పుట్టింటి నుంచి తెచ్చుకునే స్త్రీధనం కూడా ప్రత్యేకంగా ఉండాలి కదా? అనే విషయాలను దర్శకుడితో చర్చించినట్లు తెలిపారు.

అయితే మిథిల, అయోధ్య, లంక వంటి మూడు రాజ్యాల సంస్కృతులను తెరపై చూపించేటప్పుడు ఒక నిర్దిష్టమైన పద్ధతిని అనుసరించాలని చిత్ర బృందం నిర్ణయించిందని లారా వివరించారు. ప్రతి చిన్న అంశాన్ని చరిత్రకారులు, ఇతర నిపుణుల కోణంలో పరిశీలించడం మొదలుపెడితే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని చెప్పారు. అందుకే అన్ని రాజ్యాల మధ్య సంస్కృతిపరమైన తేడాలు కనిపించేలా ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఎంచుకున్నారని వెల్లడించారు.

నటిగా తాను దర్శకుడు, నిర్మాత ఆలోచనలను పూర్తిగా గౌరవించానని లారా తెలిపారు. కొన్నిసార్లు మన వ్యక్తిగత అభిప్రాయాల కంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం దర్శకుడు అనుకున్న ఆలోచనను నమ్మడం ముఖ్యమని చెప్పారు. సినిమా పూర్తయిన తర్వాత తెరపై వచ్చిన ఫలితాన్ని చూసి తానే ఆశ్చర్యపోయానని వెల్లడించారు.

ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ప్రేక్షకులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఇలాంటి చర్చలు జరగడం మంచిదేనని అన్నారు. అయితే ఒక నటిగా దర్శకుడి ఆలోచనను గౌరవించడం, తనకు అప్పగించిన పాత్రను సరిగ్గా పోషించడమే తన బాధ్యత అని చెప్పారు. ప్రేక్షకుల విమర్శలను పక్కనపెట్టి, తాను చేయాల్సిన పనిపై దృష్టి పెట్టడం ముఖ్యమని లారా దత్తా పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 8:43 pm Digital Edition : Prabhanews
Lara Dutta: ‘రామాయణం’లో కైకేయి లుక్‌పై ట్రోలింగ్.. ఎట్టకేలకు స్పందించిన లారా దత్తా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 12, 2026 8:25 PM ISTరణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.News18రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటితో పాటు కైకేయి పాత్రలో నటించిన లారా దత్తా దుస్తులపై కూడా నెటిజన్లు విమర్శలు చేశారు.ట్రైలర్‌లో లారా దత్తా మెరూన్ కలర్ చీర, గ్రీన్ కలర్ బ్లౌజ్‌లో కనిపించారు. అయితే త్రేతాయుగం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె దుస్తులు చాలా ఆధునికంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేశారు. హిందీ సీరియళ్లలో కనిపించే అత్త పాత్రల మాదిరిగా ఉన్నాయని మరికొందరు ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై గతంలో కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ నరులా తమ ఎంపికను సమర్థించుకున్నారు. తాజాగా లారా దత్తా కూడా ఈ విషయంపై తొలిసారి స్పందించారు.తన దుస్తులపై వస్తున్న విమర్శల గురించి ఆమె మాట్లాడుతూ.. సినిమా కోసం ఎలాంటి దుస్తులు ఎంచుకున్నామో, వాటిని తెరపై ఎలా చూపించాలనుకున్నామో దాని వెనుక ఒక కారణం ఉందని చెప్పారు. ఇంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలను పట్టుకుని విమర్శించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.దర్శకుడు నితేశ్ తివారీతో జరిగిన చర్చలను కూడా లారా గుర్తుచేసుకున్నారు. కైకేయి కేకయ రాజ్యానికి చెందిన యువరాణి కాబట్టి ఆమె ఆభరణాలు, దుస్తులు మిగతా ఇద్దరు రాణులైన కౌసల్య, సుమిత్రల కంటే భిన్నంగా ఉండకూడదా? తన పుట్టింటి నుంచి తెచ్చుకునే స్త్రీధనం కూడా ప్రత్యేకంగా ఉండాలి కదా? అనే విషయాలను దర్శకుడితో చర్చించినట్లు తెలిపారు.అయితే మిథిల, అయోధ్య, లంక వంటి మూడు రాజ్యాల సంస్కృతులను తెరపై చూపించేటప్పుడు ఒక నిర్దిష్టమైన పద్ధతిని అనుసరించాలని చిత్ర బృందం నిర్ణయించిందని లారా వివరించారు. ప్రతి చిన్న అంశాన్ని చరిత్రకారులు, ఇతర నిపుణుల కోణంలో పరిశీలించడం మొదలుపెడితే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని చెప్పారు. అందుకే అన్ని రాజ్యాల మధ్య సంస్కృతిపరమైన తేడాలు కనిపించేలా ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఎంచుకున్నారని వెల్లడించారు.నటిగా తాను దర్శకుడు, నిర్మాత ఆలోచనలను పూర్తిగా గౌరవించానని లారా తెలిపారు. కొన్నిసార్లు మన వ్యక్తిగత అభిప్రాయాల కంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం దర్శకుడు అనుకున్న ఆలోచనను నమ్మడం ముఖ్యమని చెప్పారు. సినిమా పూర్తయిన తర్వాత తెరపై వచ్చిన ఫలితాన్ని చూసి తానే ఆశ్చర్యపోయానని వెల్లడించారు.ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ప్రేక్షకులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఇలాంటి చర్చలు జరగడం మంచిదేనని అన్నారు. అయితే ఒక నటిగా దర్శకుడి ఆలోచనను గౌరవించడం, తనకు అప్పగించిన పాత్రను సరిగ్గా పోషించడమే తన బాధ్యత అని చెప్పారు. ప్రేక్షకుల విమర్శలను పక్కనపెట్టి, తాను చేయాల్సిన పనిపై దృష్టి పెట్టడం ముఖ్యమని లారా దత్తా పేర్కొన్నారు.మరింత చదవండి

Source link