Last Updated:
పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం వెనుక భయం, ఆందోళన, ఒత్తిడి, స్నేహితులతో సమస్యలు లేదా పాఠశాలలో ఎదురైన చేదు అనుభవాలు ఉండవచ్చు. అందుకే పిల్లలను మందలించే ముందు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్.
ఉదయం కాగానే కొన్ని ఇళ్లలో పిల్లలు బడికి వెళ్లకుండా సాకులు చెప్పడం కనిపిస్తుంది. కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉందని చెప్పడం లేదా ఇంకా నిద్ర వస్తోందని తప్పించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చదువుపై ఆసక్తి లేదని, బద్ధకంగా ఉన్నారని భావిస్తారు. కానీ ప్రతి సందర్భంలోనూ కారణం బద్ధకం కాకపోవచ్చు. పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం వెనుక భయం, ఆందోళన, ఒత్తిడి, స్నేహితులతో సమస్యలు లేదా పాఠశాలలో ఎదురైన చేదు అనుభవాలు ఉండవచ్చు. అందుకే పిల్లలను మందలించే ముందు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్ మౌనిక.

