ప్రభన్యూస్

Currency Note Shortage: దేశంలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత? RBI సంచలన ప్రకటన! | బిజినెస్


Last Updated:

Rs 10 Rs 20 Rs 50 Notes: దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లకు డిమాండ్ పెరుగుతుంది. అయితే, ఈసారి పండుగకు ముందు మార్కెట్లో చిన్న నోట్ల కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. ఆర్బీఐ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ నకిలీ సర్క్యులర్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మరి నిజంగానే చిన్న నోట్ల కొరత ఏర్పడనుందా? ఈ వైరల్ వార్తపై RBI, PIB ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పాయో తెలుసుకుందాం.

News18
News18

పండుగల సమయంలో చిన్న నోట్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సందర్భంగా షాపింగ్, చిన్న వ్యాపారాలు, రోజువారీ కొనుగోళ్ల కోసం రూ.10, రూ.20, రూ.50 నోట్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఈసారి పండుగకు ముందు తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల కొరత ఏర్పడవచ్చంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సమాచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆర్బీఐతో పాటు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పష్టత ఇచ్చింది.

నోట్ల కొరతపై వైరల్ అవుతున్న సందేశం ఏంటి?

దీపావళికి ముందు మార్కెట్లో రూ.10, రూ.20, రూ.50 నోట్లు తగినంత మొత్తంలో అందుబాటులో ఉండకపోవచ్చని ఆర్బీఐ హెచ్చరించినట్లు ఓ నకిలీ సర్క్యులర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సర్క్యులర్‌పై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉన్నట్లుగా చూపిస్తూ కొందరు వ్యక్తులు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సందేశాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తూ కొందరు నకిలీ సర్క్యులర్లను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత ఏర్పడుతుందంటూ ప్రచారం చేస్తున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది.

చిన్న నోట్ల లభ్యతపై RBI ఏం చెప్పింది?

దేశంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లతో పాటు అన్ని విలువల కరెన్సీ నోట్లు తగినంత మొత్తంలో అందుబాటులో ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. తమ వద్ద ఉన్న నిల్వలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కరెన్సీ చెస్ట్‌లలో కూడా అవసరమైన మేరకు నోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. కాబట్టి పండుగ సీజన్‌లో చిన్న నోట్ల కొరత ఏర్పడుతుందనే ఆందోళన అవసరం లేదని తెలిపింది. అలాగే, తక్కువ విలువ కలిగిన నోట్ల సరఫరాపై ఆర్బీఐ ఎలాంటి కొరత ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి నకిలీ సర్క్యులర్లను చూసి గందరగోళానికి గురికావద్దని సూచించింది. ఆర్బీఐ పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని నిజమని నమ్మకూడదని హెచ్చరించింది.

PIB ఫ్యాక్ట్ చెక్ కూడా ఏం చెప్పింది?

ఈ వైరల్ సందేశంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పందించింది. దీపావళికి ముందు రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత ఏర్పడవచ్చంటూ ఆర్బీఐ ప్రకటించినట్లు వాట్సాప్‌లో ప్రచారమవుతున్న సమాచారం నకిలీదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆర్బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపింది.

ప్రజలు ఏం చేయాలి?

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మి ఇతరులకు పంపించకూడదు. ముఖ్యంగా బ్యాంకులు, కరెన్సీ నోట్లు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసే ముందు అధికారిక వెబ్‌సైట్లు, ప్రకటనల్లో నిజానిజాలు తెలుసుకోవాలి. అనుమానాస్పద సర్క్యులర్లు కనిపిస్తే వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా ఉండాలి. ఆర్బీఐ విడుదల చేసే అధికారిక సమాచారం, PIB ఫ్యాక్ట్ చెక్ వివరాలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 9:41 am Digital Edition : Prabhanews
Currency Note Shortage: దేశంలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత? RBI సంచలన ప్రకటన! | బిజినెస్

Last Updated:Nov 03, 2026 9:36 AM ISTRs 10 Rs 20 Rs 50 Notes: దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లకు డిమాండ్ పెరుగుతుంది. అయితే, ఈసారి పండుగకు ముందు మార్కెట్లో చిన్న నోట్ల కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. ఆర్బీఐ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ నకిలీ సర్క్యులర్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మరి నిజంగానే చిన్న నోట్ల కొరత ఏర్పడనుందా? ఈ వైరల్ వార్తపై RBI, PIB ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పాయో తెలుసుకుందాం.
News18పండుగల సమయంలో చిన్న నోట్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సందర్భంగా షాపింగ్, చిన్న వ్యాపారాలు, రోజువారీ కొనుగోళ్ల కోసం రూ.10, రూ.20, రూ.50 నోట్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఈసారి పండుగకు ముందు తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల కొరత ఏర్పడవచ్చంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సమాచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆర్బీఐతో పాటు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పష్టత ఇచ్చింది.నోట్ల కొరతపై వైరల్ అవుతున్న సందేశం ఏంటి?దీపావళికి ముందు మార్కెట్లో రూ.10, రూ.20, రూ.50 నోట్లు తగినంత మొత్తంలో అందుబాటులో ఉండకపోవచ్చని ఆర్బీఐ హెచ్చరించినట్లు ఓ నకిలీ సర్క్యులర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సర్క్యులర్‌పై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉన్నట్లుగా చూపిస్తూ కొందరు వ్యక్తులు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సందేశాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తూ కొందరు నకిలీ సర్క్యులర్లను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత ఏర్పడుతుందంటూ ప్రచారం చేస్తున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది.
It has come to the notice of Reserve Bank of India that certain elements are fraudulently using the name/ logo of Reserve Bank of India and circulating forged circular signed in the name of the Governor, RBI indicating that there may be a shortage of currency in lower denominations of ₹10, ₹20 and ₹50 during the upcoming festival season. It is clarified at the outset that sufficient notes of all denominations, including lower denominations are available in the RBI vaults and currency chests and the content of the forged circular is misleading.
Members of the public are, therefore, requested to rely on the information published by RBI from time to time in such matters.— ReserveBankOfIndia (@RBI) November 2, 2026చిన్న నోట్ల లభ్యతపై RBI ఏం చెప్పింది?దేశంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లతో పాటు అన్ని విలువల కరెన్సీ నోట్లు తగినంత మొత్తంలో అందుబాటులో ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. తమ వద్ద ఉన్న నిల్వలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కరెన్సీ చెస్ట్‌లలో కూడా అవసరమైన మేరకు నోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. కాబట్టి పండుగ సీజన్‌లో చిన్న నోట్ల కొరత ఏర్పడుతుందనే ఆందోళన అవసరం లేదని తెలిపింది. అలాగే, తక్కువ విలువ కలిగిన నోట్ల సరఫరాపై ఆర్బీఐ ఎలాంటి కొరత ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి నకిలీ సర్క్యులర్లను చూసి గందరగోళానికి గురికావద్దని సూచించింది. ఆర్బీఐ పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని నిజమని నమ్మకూడదని హెచ్చరించింది.PIB ఫ్యాక్ట్ చెక్ కూడా ఏం చెప్పింది?ఈ వైరల్ సందేశంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పందించింది. దీపావళికి ముందు రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత ఏర్పడవచ్చంటూ ఆర్బీఐ ప్రకటించినట్లు వాట్సాప్‌లో ప్రచారమవుతున్న సమాచారం నకిలీదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆర్బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపింది.
🚨 Beware of False Claims!
A message being circulated on WhatsApp claims that the RBI has announced that new ₹10, ₹20 and ₹50 denomination banknotes may not be available in sufficient quantities ahead of Diwali.#PIBFactCheck:❌ The claim is FAKE.✅ The @RBI has made NO such announcement regarding the availability of small denomination banknotes.ℹ️ Verify information through official sources and do not share unverified claims.— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2026ప్రజలు ఏం చేయాలి?సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మి ఇతరులకు పంపించకూడదు. ముఖ్యంగా బ్యాంకులు, కరెన్సీ నోట్లు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసే ముందు అధికారిక వెబ్‌సైట్లు, ప్రకటనల్లో నిజానిజాలు తెలుసుకోవాలి. అనుమానాస్పద సర్క్యులర్లు కనిపిస్తే వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా ఉండాలి. ఆర్బీఐ విడుదల చేసే అధికారిక సమాచారం, PIB ఫ్యాక్ట్ చెక్ వివరాలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.మరింత చదవండి

Source link