ప్రభన్యూస్

Jana Nayagan OTT: జన నాయగన్ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడో తెలుసా? ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే.. | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సీఎం విజయ్ హీరోగా వచ్చిన కొత్త సినిమా జన నాయగన్. థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

News18
News18

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన కొత్త సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఆయన సినీ కెరీర్‌కు ముగింపు పలుకుతూ చేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ హెచ్. వినోత్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాలో.. విజయ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ‘దళపతి వెట్రి కొండన్’ పాత్రలో తనదైన మార్క్ చూపించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అయితే, దళపతి చివరి సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నప్పటికీ, తీరా థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. సినిమాలో విజయ్ మార్క్ మాస్ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించినా.. కథనం నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు బాగా సాగదీతగా అనిపించడంతో ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి పాపులర్ మూవీ రేటింగ్ వెబ్‌సైట్ IMDbలో 10కి కేవలం 6.1 రేటింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కుల వ్యవహారం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘జన నాయగన్’ విడుదలకు ముందే దీని డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) మేకర్స్‌తో చర్చలు జరిపింది. సుమారు రూ. 110 కోట్లకు భారీ డీల్ కుదురుతుందని ప్రచారం జరిగింది. కానీ, సినిమా విడుదలలో జరిగిన జాప్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆ ఒప్పందం క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తాజా సమాచారం ప్రకారం, మరో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను కేవలం రూ. 50 కోట్లకు దక్కించుకుందని ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే తొలుత అనుకున్న దానికంటే దాదాపు రూ. 60 కోట్ల తక్కువకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడం ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న బజ్ ప్రకారం ఆగస్టు 21 నుంచి ‘జన నాయగన్’ జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలోనూ జనాల్లో క్యూరియాసిటీ ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 2:38 pm Digital Edition : Prabhanews
Jana Nayagan OTT: జన నాయగన్ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడో తెలుసా? ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 24, 2026 2:37 PM ISTసీఎం విజయ్ హీరోగా వచ్చిన కొత్త సినిమా జన నాయగన్. థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. News18తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన కొత్త సినిమా 'జన నాయగన్' (తెలుగులో 'జన నాయకుడు'). ఆయన సినీ కెరీర్‌కు ముగింపు పలుకుతూ చేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ హెచ్. వినోత్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాలో.. విజయ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ 'దళపతి వెట్రి కొండన్' పాత్రలో తనదైన మార్క్ చూపించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.అయితే, దళపతి చివరి సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నప్పటికీ, తీరా థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. సినిమాలో విజయ్ మార్క్ మాస్ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించినా.. కథనం నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు బాగా సాగదీతగా అనిపించడంతో ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి పాపులర్ మూవీ రేటింగ్ వెబ్‌సైట్ IMDbలో 10కి కేవలం 6.1 రేటింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం.ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కుల వ్యవహారం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'జన నాయగన్' విడుదలకు ముందే దీని డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) మేకర్స్‌తో చర్చలు జరిపింది. సుమారు రూ. 110 కోట్లకు భారీ డీల్ కుదురుతుందని ప్రచారం జరిగింది. కానీ, సినిమా విడుదలలో జరిగిన జాప్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆ ఒప్పందం క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తాజా సమాచారం ప్రకారం, మరో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను కేవలం రూ. 50 కోట్లకు దక్కించుకుందని ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే తొలుత అనుకున్న దానికంటే దాదాపు రూ. 60 కోట్ల తక్కువకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడం ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరుస్తోంది.ప్రస్తుతం వినిపిస్తున్న బజ్ ప్రకారం ఆగస్టు 21 నుంచి 'జన నాయగన్' జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలోనూ జనాల్లో క్యూరియాసిటీ ఉంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link