సింపుల్‌గా గుర్తుంచుకోవాల్సింది
1 తులం = 11.6638 గ్రాములు (సుమారు 11.66 గ్రాములు). కాబట్టి 1 తులం అంటే 10 గ్రాములు అనుకోవడం సరైనది కాదు. బంగారం కొనుగోలు చేసేటప్పుడు తులం అనే పదం వినిపిస్తే, దాని బరువు ఎంత గ్రాములుగా లెక్కిస్తున్నారో, ధర ఎలా నిర్ణయించారో బిల్లులో స్పష్టంగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసేవారు బరువు, స్వచ్ఛత, ధర, మేకింగ్ ఛార్జీలు వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
