ప్రభన్యూస్

Jailer 2 OTT Release Date: జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

జైలర్ సినిమాకు సీక్వెల్‌గా భారీ అంచనాలతో వచ్చిన ‘జైలర్-2’ దసరా కానుకగా అక్టోబరు 15న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ లోకి రాబోతోంది.

News18
News18

సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా భారీ అంచనాలతో వచ్చిన ‘జైలర్-2’ దసరా కానుకగా అక్టోబరు 15న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, నెల రోజులు తిరగకముందే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

రూ.800 కోట్లతో రజనీ సరికొత్త చరిత్ర:

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, కోలీవుడ్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన తొలి తమిళ చిత్రంగా సరికొత్త రికార్డును లిఖించింది. కేవలం భారతదేశంలోనే రూ.541.65 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.275.25 కోట్లతో రజనీకాంత్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది.

నవంబరు 12 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్:

థియేటర్లలో రికార్డుల మోత మోగించిన ‘జైలర్-2’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. నవంబరు 12వ తేదీ నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. “టైగర్ ముత్తువేల్ పాండియన్ ఈజ్ బ్యాక్.. రీలోడెడ్ విత్ నవంబరు 12” అంటూ ప్రైమ్ వీడియో ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలో అన్‌కట్ వెర్షన్..?

ఈ చిత్రంలో ఎస్.జే.సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడి, విద్యాబాలన్ వంటి స్టార్ క్యాస్ట్ అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. ఇక శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్ అతిథి పాత్రలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇదిలా ఉంటే, ఓటీటీ ప్రేక్షకులకు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో ప్రదర్శించిన 2 గంటల 40 నిమిషాల వెర్షన్ కాకుండా, అదనంగా మరో 30 నిమిషాల నిడివి ఉన్న ‘అన్‌కట్ వెర్షన్’ను ప్రైమ్‌లో విడుదల చేయనున్నారని సమాచారం. మోహన్‌లాల్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, సంతానంలకు సంబంధించిన మరిన్ని కీలక సన్నివేశాలు ఇందులో ఉండనున్నాయట.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 5:36 pm Digital Edition : Prabhanews
Jailer 2 OTT Release Date: జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 05, 2026 2:36 PM ISTజైలర్ సినిమాకు సీక్వెల్‌గా భారీ అంచనాలతో వచ్చిన 'జైలర్-2' దసరా కానుకగా అక్టోబరు 15న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ లోకి రాబోతోంది. News18సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'జైలర్' ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా భారీ అంచనాలతో వచ్చిన 'జైలర్-2' దసరా కానుకగా అక్టోబరు 15న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, నెల రోజులు తిరగకముందే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.రూ.800 కోట్లతో రజనీ సరికొత్త చరిత్ర:బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, కోలీవుడ్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన తొలి తమిళ చిత్రంగా సరికొత్త రికార్డును లిఖించింది. కేవలం భారతదేశంలోనే రూ.541.65 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.275.25 కోట్లతో రజనీకాంత్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది.నవంబరు 12 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్:థియేటర్లలో రికార్డుల మోత మోగించిన 'జైలర్-2' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. నవంబరు 12వ తేదీ నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. "టైగర్ ముత్తువేల్ పాండియన్ ఈజ్ బ్యాక్.. రీలోడెడ్ విత్ నవంబరు 12" అంటూ ప్రైమ్ వీడియో ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీలో అన్‌కట్ వెర్షన్..?ఈ చిత్రంలో ఎస్.జే.సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడి, విద్యాబాలన్ వంటి స్టార్ క్యాస్ట్ అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. ఇక శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్ అతిథి పాత్రలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇదిలా ఉంటే, ఓటీటీ ప్రేక్షకులకు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో ప్రదర్శించిన 2 గంటల 40 నిమిషాల వెర్షన్ కాకుండా, అదనంగా మరో 30 నిమిషాల నిడివి ఉన్న 'అన్‌కట్ వెర్షన్'ను ప్రైమ్‌లో విడుదల చేయనున్నారని సమాచారం. మోహన్‌లాల్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, సంతానంలకు సంబంధించిన మరిన్ని కీలక సన్నివేశాలు ఇందులో ఉండనున్నాయట.మరింత చదవండి

Source link