Last Updated:
రాను రాను ట్రెండ్ మారడంతో కొన్నేళ్ల క్రితం సింగల్ సినిమా థియేటర్లన్నీ మూతపడి ముల్టీప్లెక్స్ ట్రెండ్ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్, సుదర్శన్ 70mm థియేటర్ ప్లేస్‌లో AMB విక్టరీ థియేటర్ సిద్ధమవుతోంది.
హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే థియేటర్స్ అడ్డా. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు హబ్‌గా ఉండే ఈ ఏరియాలో 100 రోజులు ఆడితేనే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉండేది. అయితే రాను రాను ట్రెండ్ మారడంతో కొన్నేళ్ల క్రితం సింగల్ సినిమా థియేటర్లన్నీ మూతపడి ముల్టీప్లెక్స్ ట్రెండ్ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్, సుదర్శన్ 70mm థియేటర్ ప్లేస్‌లో AMB విక్టరీ థియేటర్ సిద్ధమవుతోంది.
AMB సినిమాస్ థియేటర్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి వచ్చిన మహేష్ బాబు, ఇప్పుడు ‘విక్టరీ’ వెంకటేశ్‌తో కలిసి AMB విక్టరీ థియేటర్‌ను సిద్ధం చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రీమియం సినిమా థియేటర్లలో ఒకటైన AMB విక్టరీ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన 7 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను కలిగి ఉంది. ఇందులో ఒక IMAX స్క్రీన్ కూడా ఉంది. ఈ థియేటర్‌లోని స్క్రీన్లకు అత్యాధునిక 4K RGB లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ జోడిస్తున్నారట. ఈ సాంకేతికత ప్రేక్షకులకు అత్యుత్తమ చిత్ర నాణ్యతను, అద్భుతమైన సినిమా అనుభూతిని అందిస్తుంది. ఈ భాగస్వామ్యం UFO నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంలో మరో ముఖ్యమైన మైలురాయి.
‘AMB విక్టరీ సినిమాస్‌తో మా భాగస్వామ్యం విజయవంతంగా దీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రేక్షకులకు మరింత అద్భుతమైన సినిమా అనుభూతులను అందించడమే మా లక్ష్యం. ఈ అవకాశం కల్పించిన ఏషియన్ సినిమాస్, దగ్గుబాటి సురేష్ బాబు, మహేష్ బాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అలాగే శ్రీ దగ్గుబాటి సురేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’ అని UFO సినీ మీడియా నెట్‌వర్క్ తెలిపింది.

