జబర్దస్త్ ద్వారానే కాదు సినిమాల పరంగా కూడా హైపర్ ఆదికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అల్లరి నరేష్ నటించిన మేడ మీద అమ్మాయి సినిమాలో నటించడంతో పాటు, ఆ సినిమాకు డైలాగ్ రైటర్ గాను వ్యవహరించాడు ఆది. ఆ తర్వాత తొలిప్రేమ, ఆటగదరా శివ, సవ్యసాచి, మిస్టర్ మజ్ను, వెంకీ మామ, అల వైకుంఠపురములో, క్రాక్, ధమాకా, సార్, దాస్ కా ధమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, పుష్ప 2, మజాకా వంటి సినిమాల్లో కామెడీ పాత్రలతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది అంటే పంచ్ పలక్‌నామా అనే పేరు సంపాదించాడు.

