Last Updated:
హోండా ఏడీవీ160 స్కూటర్ భారత్‌లో విడుదలైంది. రూ.1.70 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో వచ్చిన ఈ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది 85 శాతం వరకు ఇథనాల్ కలిసిన ఇంధనంతో నడిచే దేశంలోనే తొలి స్కూటర్.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కొత్త ఏడీవీ160 అడ్వెంచర్-స్టైల్ స్కూటర్ ధరను ప్రకటించింది. బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.70 లక్షలుగా ఉంది. డెలివరీ సమయంలో వర్తించే నిబంధనలు, షరతుల ప్రకారం ఎక్స్‌షోరూమ్ ధర మారే అవకాశం ఉందని హోండా తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.5,000 బుకింగ్ అమౌంట్‌తో ఏడీవీ160ను బుక్ చేసుకోవచ్చు. హోండా అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా అధీకృత హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చు.

