Last Updated:
గతంతో పోలిస్తే డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటిస్ తగ్గిపోవడంతో నిశ్చల జీవనశైలి చాలామందికి అలవాటుగా మారింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం శరీర ఆరోగ్యానికే కాకుండా మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది డెస్క్ జాబ్స్, కంప్యూటర్ పనులు, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో రోజులో ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని, గంటల తరబడి కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌ను చూస్తూ గడుపుతున్నారు. పని ప్రదేశానికి వెళ్లి రావడానికి పట్టే ప్రయాణ సమయం కూడా దీనికి తోడవుతోంది. గతంతో పోలిస్తే డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటిస్ తగ్గిపోవడంతో నిశ్చల జీవనశైలి చాలామందికి అలవాటుగా మారింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం శరీర ఆరోగ్యానికే కాకుండా మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

