డబ్బు సంపాదించడానికి ఎన్నో ఏళ్లు కష్టపడాలి.. కానీ ఒక్క సంతకం జీవితాంతం కూడబెట్టిన ఆస్తిని క్షణాల్లో దూరం చేయొచ్చు. 40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన వందల కోట్ల ఆస్తి కేవలం నాలుగు సెకన్లలో చేజారిపోయిందంటే నమ్మగలరా? ఒకప్పుడు ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపి, ఆ తర్వాత ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న ఓ సీనియర్ నటి తన జీవితంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే, ఇంతటి భారీ నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ తనకు ఎలాంటి బాధ లేదని, డబ్బు కంటే ఆరోగ్యం, మనశ్శాంతి, కుటుంబంతో గడిపే సమయమే ముఖ్యమని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

