Last Updated:
ప్రతి గాయానికి ఒకే విధమైన చికిత్స ఉండదు. కొన్ని సందర్భాల్లో తప్పు పద్ధతులు గాయాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చు. అందుకే తల్లిదండ్రులు ప్రాథమిక ప్రథమ చికిత్స గురించి తెలుసుకోవడం చాలా అవసరం
పిల్లలు ఆడుకునే సమయంలో కిందపడటం, చిన్న గాయాలు కావడం, కోసుకోవడం, వస్తువులతో తగలడం లేదా వేడి పదార్థాలతో కాలిపోవడం చాలా సాధారణం. ఇలాంటి సందర్భాల్లో పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా ఆందోళన చెందుతారు. భయంతో వెంటనే ఏదో ఒక ఇంటి చిట్కా పాటించాలనుకుంటారు. కానీ ప్రతి గాయానికి ఒకే విధమైన చికిత్స ఉండదు. కొన్ని సందర్భాల్లో తప్పు పద్ధతులు గాయాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చు. అందుకే తల్లిదండ్రులు ప్రాథమిక ప్రథమ చికిత్స గురించి తెలుసుకోవడం చాలా అవసరమని పీడియాట్రిషన్ డాక్టర్ సురేష్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.

