అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త బాల్‌రూమ్‌ను సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించిన ట్రంప్.. అక్కడ పనిచేస్తున్న కార్మికులను అభినందించారు. ఈ కొత్త బాల్రూమ్ డ్రోన్లు, మిస్సైళ్లు, బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించేలా నిర్మిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. దీని బలోపేతమైన పైకప్పుపై అనేక హెలికాప్టర్లు నిలిపే సామర్థ్యం ఉంటుందని, అధ్యక్షుడితో పాటు ప్రపంచ నాయకులకు భద్రత కల్పించేలా ఈ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు.
Source link
