దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ రకరకాల స్వీట్లు, హాట్ తయారు చేస్తుంటారు. లడ్డూలు, అరిసెలు, మురుకులు, చెక్కలు వంటి పిండి వంటకాలను కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు పంచుతారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఈ చిరుతిళ్లు కొన్ని రోజులకే రుచి కోల్పోవడం, మెత్తబడిపోవడం లేదా మాడిపోయిన వాసన రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే వాటి రుచి, నాణ్యతను కొంతకాలం కాపాడుకోవచ్చు. ఇందుకోసం కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి.

