Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై రూ. 1,420 వరకు పతనం! తాజా ధరలు ఇవే | బిజినెస్


Last Updated:

హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold Rates Today: పసిడి ప్రేమికులకు బులియన్ మార్కెట్ భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రభావంతో హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

స్వచ్ఛమైన 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910లకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1,420 పతనం. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ. 1,300 మేర దిగివచ్చి రూ. 1,31,000 మార్కుకు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,070 క్షీణించి రూ.1,07,180కి చేరింది. ఇక వెండి ధరల్లో మార్పులు లేవు

కొనుగోలుదారులకు మంచి అవకాశం

ప్రస్తుతం పెళ్లిళ్లు, పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో తులం బంగారంపై ₹1,300 నుండి ₹1,420 వరకు ధర తగ్గడం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ధరల్లో మరికొంత మార్పు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, సింగపూర్‌లో 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం రూ.1,32,841గా నమోదైంది. క్రితం ధరతో పోలిస్తే అక్కడ బంగారం ధరల్లో రూ. 1,405 పతనం అయ్యింది. ఇక దుబాయ్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం రూ.1,29,463గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ మారకం విలువ, స్థానిక డిమాండ్, అంతర్జాతీయ బులియన్ ట్రేడింగ్‌లో వచ్చిన మార్పుల కారణంగా దుబాయ్ మార్కెట్‌లో ఈ పెరుగుదల కనిపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 July 2026, 10:22 am Digital Edition : Prabhanews
Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై రూ. 1,420 వరకు పతనం! తాజా ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Jul 13, 2026 9:54 AM ISTహైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.ప్రతీకాత్మక చిత్రంGold Rates Today: పసిడి ప్రేమికులకు బులియన్ మార్కెట్ భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రభావంతో హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.స్వచ్ఛమైన 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910లకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1,420 పతనం. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ. 1,300 మేర దిగివచ్చి రూ. 1,31,000 మార్కుకు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,070 క్షీణించి రూ.1,07,180కి చేరింది. ఇక వెండి ధరల్లో మార్పులు లేవుకొనుగోలుదారులకు మంచి అవకాశంప్రస్తుతం పెళ్లిళ్లు, పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో తులం బంగారంపై ₹1,300 నుండి ₹1,420 వరకు ధర తగ్గడం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ధరల్లో మరికొంత మార్పు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, సింగపూర్‌లో 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం రూ.1,32,841గా నమోదైంది. క్రితం ధరతో పోలిస్తే అక్కడ బంగారం ధరల్లో రూ. 1,405 పతనం అయ్యింది. ఇక దుబాయ్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం రూ.1,29,463గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ మారకం విలువ, స్థానిక డిమాండ్, అంతర్జాతీయ బులియన్ ట్రేడింగ్‌లో వచ్చిన మార్పుల కారణంగా దుబాయ్ మార్కెట్‌లో ఈ పెరుగుదల కనిపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link