ప్రభన్యూస్

Janaki Final Rites: నాన్నమ్మ జానకికి తలకొరివి పెట్టిన మనవరాలు.. దహన సంస్కారాలు చేసిన అప్సర విద్యుల | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Janaki Final Rites: ఈ సంవత్సరం జనవరిలో జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడం ఆమెను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. తన కుమారుడి మరణం తర్వాత ఆమె బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెంచుకుని మౌనంగా ఉండిపోయారు.

దక్షిణ భారత గానకోకిలగా పేరుగాంచిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్. జానకి గారు (88 ఏళ్లు) శనివారం, జూలై 11, 2026న కర్ణాటకలోని మైసూరులో కన్నుమూశారు. వయోభారం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమెను మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ బహుళ అవయవ వైఫల్యం, తీవ్రమైన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. 2026 జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడం ఆమెను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. తన కుమారుడి మరణం తర్వాత ఆమె బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెంచుకుని మౌనంగా ఉండిపోయారు.

అంత్యక్రియలు ఎక్కడ, ఎలా జరిగాయి?

జులై 12, ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరుకు సమీపంలోని కణియర హుండిలో గల ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో, పోలీసుల గౌరవ వందనంతో జానకి పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు వేల మంది అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచారు. రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ వర్గాల వారు అక్కడికి చేరుకుని ఘనంగా నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి: New Voter ID Registration: కొత్త ఓటర్లకు పేరెంట్స్ “సర్” తప్పనిసరి.. మెలిక పెట్టిన అధికారులు.. ఇదేంటి.. వివరాలివే!

సాధారణంగా అంత్యక్రియల సమయంలో మగవాళ్లు (కుమారులు లేదా మనవళ్లు) తలకొరివి పెడతారు. జానకి భర్త వి.రామప్రసాద్ 1997లోనే మరణించారు, అలాగే ఆమె కుమారుడు మురళీకృష్ణ కూడా ఇటీవలే మరణించారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా, పాత సంప్రదాయాలను పక్కనపెట్టి ఆమెకు ఎంతో ఇష్టమైన మనవరాలు, మురళీకృష్ణ కూతురు అప్సర విద్యుల (Apsara Vydyula) స్వయంగా తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛరణల మధ్య అప్సర తన నానమ్మ చితికి నిప్పంటించి చివరి క్రతువును పూర్తి చేశారు. అప్సర మీడియాతో మాట్లాడుతూ, “ఆమె ప్రపంచానికి ఒక గొప్ప దిగ్గజ గాయని కావొచ్చు, కానీ నాకు మాత్రం ఎంతో ప్రేమను పంచిన గొప్ప నానమ్మ. ఆమె ఎప్పుడూ తన చిరునవ్వుతో అందరినీ అలరించేది” అని భావోద్వేగం చెందారు.

ఇవి కూడా చదవండి: Astrology: మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, ధ్రువ యోగం.. 12 రాశులకు అద్భుత ఫలితాలు

ఎస్. జానకి మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన జానకమ్మ సంగీత ప్రస్థానం ఎప్పటికీ అజరామరం. 1957లో కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర 20కి పైగా భాషల్లో సుమారు 48,000 కు పైగా పాటలు పాడారు. ముఖ్యంగా ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి కాంబినేషన్ భారతీయ చలనచిత్ర సంగీతంలో ఒక సువర్ణ అధ్యాయం.

తన సుదీర్ఘ కెరీర్‌లో 4 జాతీయ అవార్డులు, 33 రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించినప్పటికీ, ఆ అవార్డు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమానం ఆమెది. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, తన సుమధురమైన గొంతుతో, పలికించిన అద్భుతమైన భావాలతో, వేలాది పాటల రూపంలో ఎస్. జానకి గారు శ్రోతల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా జీవించే ఉంటారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 July 2026, 10:21 am Digital Edition : Prabhanews
Janaki Final Rites: నాన్నమ్మ జానకికి తలకొరివి పెట్టిన మనవరాలు.. దహన సంస్కారాలు చేసిన అప్సర విద్యుల | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 13, 2026 9:39 AM ISTJanaki Final Rites: ఈ సంవత్సరం జనవరిలో జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడం ఆమెను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. తన కుమారుడి మరణం తర్వాత ఆమె బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెంచుకుని మౌనంగా ఉండిపోయారు.
దక్షిణ భారత గానకోకిలగా పేరుగాంచిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్. జానకి గారు (88 ఏళ్లు) శనివారం, జూలై 11, 2026న కర్ణాటకలోని మైసూరులో కన్నుమూశారు. వయోభారం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమెను మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ బహుళ అవయవ వైఫల్యం, తీవ్రమైన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. 2026 జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడం ఆమెను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. తన కుమారుడి మరణం తర్వాత ఆమె బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెంచుకుని మౌనంగా ఉండిపోయారు.అంత్యక్రియలు ఎక్కడ, ఎలా జరిగాయి?జులై 12, ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరుకు సమీపంలోని కణియర హుండిలో గల ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో, పోలీసుల గౌరవ వందనంతో జానకి పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు వేల మంది అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచారు. రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ వర్గాల వారు అక్కడికి చేరుకుని ఘనంగా నివాళులర్పించారు.ఇవి కూడా చదవండి: New Voter ID Registration: కొత్త ఓటర్లకు పేరెంట్స్ "సర్" తప్పనిసరి.. మెలిక పెట్టిన అధికారులు.. ఇదేంటి.. వివరాలివే!సాధారణంగా అంత్యక్రియల సమయంలో మగవాళ్లు (కుమారులు లేదా మనవళ్లు) తలకొరివి పెడతారు. జానకి భర్త వి.రామప్రసాద్ 1997లోనే మరణించారు, అలాగే ఆమె కుమారుడు మురళీకృష్ణ కూడా ఇటీవలే మరణించారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా, పాత సంప్రదాయాలను పక్కనపెట్టి ఆమెకు ఎంతో ఇష్టమైన మనవరాలు, మురళీకృష్ణ కూతురు అప్సర విద్యుల (Apsara Vydyula) స్వయంగా తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.వేద మంత్రోచ్ఛరణల మధ్య అప్సర తన నానమ్మ చితికి నిప్పంటించి చివరి క్రతువును పూర్తి చేశారు. అప్సర మీడియాతో మాట్లాడుతూ, "ఆమె ప్రపంచానికి ఒక గొప్ప దిగ్గజ గాయని కావొచ్చు, కానీ నాకు మాత్రం ఎంతో ప్రేమను పంచిన గొప్ప నానమ్మ. ఆమె ఎప్పుడూ తన చిరునవ్వుతో అందరినీ అలరించేది" అని భావోద్వేగం చెందారు.ఇవి కూడా చదవండి: Astrology: మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, ధ్రువ యోగం.. 12 రాశులకు అద్భుత ఫలితాలుఎస్. జానకి మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన జానకమ్మ సంగీత ప్రస్థానం ఎప్పటికీ అజరామరం. 1957లో కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర 20కి పైగా భాషల్లో సుమారు 48,000 కు పైగా పాటలు పాడారు. ముఖ్యంగా ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి కాంబినేషన్ భారతీయ చలనచిత్ర సంగీతంలో ఒక సువర్ణ అధ్యాయం.తన సుదీర్ఘ కెరీర్‌లో 4 జాతీయ అవార్డులు, 33 రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించినప్పటికీ, ఆ అవార్డు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమానం ఆమెది. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, తన సుమధురమైన గొంతుతో, పలికించిన అద్భుతమైన భావాలతో, వేలాది పాటల రూపంలో ఎస్. జానకి గారు శ్రోతల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా జీవించే ఉంటారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link