ప్రభన్యూస్

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవే | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.

MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,166 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.150 తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,25,600 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.487 తగ్గింది.

ఇక ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,260గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.190 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,36,822 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీపై రూ. 590 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,25,860 వద్ద కొనసాగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 9:21 am Digital Edition : Prabhanews
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవే | బిజినెస్

Last Updated:Oct 06, 2026 9:07 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.ప్రతీకాత్మక చిత్రంమంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,166 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.150 తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,25,600 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.487 తగ్గింది.ఇక ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,260గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.190 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,36,822 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీపై రూ. 590 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,25,860 వద్ద కొనసాగుతుంది.మరింత చదవండి

Source link