ప్రభన్యూస్

Gold Price Today: దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. మరోసారి భగ్గుమన్న వెండి.. ఈరోజు ఎంత పెరిగిందంటే! | బిజినెస్


Last Updated:

Gold Price Today: బంగారం ధరలు తగ్గుతున్నాయని కొనుగోలుకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు మళ్లీ షాక్ తప్పలేదు. నిన్న భారీగా పడిపోయిన పసిడి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. బంగారంతో పాటు వెండి కూడా పైపైకి కదిలింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

News18
News18

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ధరలు తగ్గాయని సంతోషపడుతున్నారా? అయితే మీకు ఈరోజు మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. నిన్నటివరకు భారీగా పడిపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పైకి ఎగబాకాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారికి మళ్లీ నిరాశ ఎదురైంది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పాటు పెట్టుబడిదారుల కొనుగోళ్ల కారణంగా విలువైన లోహాల ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.

MCXలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?

శుక్రవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,230 వద్ద ట్రేడయింది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా రూ.1,008 పెరిగింది. నిన్నటి పతనం తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల కనిపించడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. బంగారంతో పాటు వెండి కూడా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,79,777 వద్ద ట్రేడయింది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,058 పెరిగింది. దీంతో వెండి కొనాలనుకునేవారికి కూడా ధరల పెరుగుదల భారంగా మారుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు ఎంత పెరిగాయంటే?

ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.960 పెరిగి రూ.1,37,750కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు పెరిగి రూ.1,26,270 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.700 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,80,220కు చేరుకుంది. మొత్తంగా నిన్న ధరలు తగ్గడంతో కొనుగోలుకు సిద్ధమైన వారికి ఈరోజు మార్కెట్‌లో వచ్చిన అనూహ్య పెరుగుదల నిరాశ కలిగిస్తోంది. అయితే ఇవి ఉదయం ట్రేడింగ్ సమయంలో నమోదైన ధరలు మాత్రమే. మార్కెట్ కదలికలను బట్టి రోజులో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 9:15 am Digital Edition : Prabhanews
Gold Price Today: దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. మరోసారి భగ్గుమన్న వెండి.. ఈరోజు ఎంత పెరిగిందంటే! | బిజినెస్

Last Updated:Nov 13, 2026 9:15 AM ISTGold Price Today: బంగారం ధరలు తగ్గుతున్నాయని కొనుగోలుకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు మళ్లీ షాక్ తప్పలేదు. నిన్న భారీగా పడిపోయిన పసిడి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. బంగారంతో పాటు వెండి కూడా పైపైకి కదిలింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?
News18బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ధరలు తగ్గాయని సంతోషపడుతున్నారా? అయితే మీకు ఈరోజు మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. నిన్నటివరకు భారీగా పడిపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పైకి ఎగబాకాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారికి మళ్లీ నిరాశ ఎదురైంది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పాటు పెట్టుబడిదారుల కొనుగోళ్ల కారణంగా విలువైన లోహాల ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.MCXలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?శుక్రవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,230 వద్ద ట్రేడయింది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా రూ.1,008 పెరిగింది. నిన్నటి పతనం తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల కనిపించడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. బంగారంతో పాటు వెండి కూడా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,79,777 వద్ద ట్రేడయింది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,058 పెరిగింది. దీంతో వెండి కొనాలనుకునేవారికి కూడా ధరల పెరుగుదల భారంగా మారుతోంది.హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు ఎంత పెరిగాయంటే?ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.960 పెరిగి రూ.1,37,750కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు పెరిగి రూ.1,26,270 వద్ద కొనసాగుతోంది.ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.700 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,80,220కు చేరుకుంది. మొత్తంగా నిన్న ధరలు తగ్గడంతో కొనుగోలుకు సిద్ధమైన వారికి ఈరోజు మార్కెట్‌లో వచ్చిన అనూహ్య పెరుగుదల నిరాశ కలిగిస్తోంది. అయితే ఇవి ఉదయం ట్రేడింగ్ సమయంలో నమోదైన ధరలు మాత్రమే. మార్కెట్ కదలికలను బట్టి రోజులో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.మరింత చదవండి

Source link