MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,950 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.833 పెరుగుదల. అంటే ఒక్క సెషన్‌లోనే 10 గ్రాముల బంగారం ధరలో గణనీయమైన మార్పు కనిపించింది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు భవిష్యత్ ధరలను అంచనా వేసి కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుండటంతో ఇలాంటి కదలికలు వేగంగా కనిపిస్తాయి. వెండి ధర కూడా ఇదే సమయంలో పెరిగింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ కిలో వెండి ధర రూ.2,25,565 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండి ధర రూ.1,859 పెరిగింది. దీంతో వరుసగా బంగారం, వెండి రెండింటిలోనూ ఉదయం ట్రేడింగ్‌లో కొనుగోలు ఆసక్తి కనిపించింది.

