మార్కెట్లో లభించే కూలెంట్లు ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు, నారింజ, ఊదా రంగులలో ఉంటాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తులను వారి స్వంత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తుంది. రంగు అనేది నాణ్యతకు సూచిక కాదు. వీటిని కొనుగోలు చేసేటప్పుడు కారు మాన్యువల్ , సర్వీస్ సెంటర్ సలహాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవాలి. సరైన కూలెంట్‌ను ఉపయోగించడం వల్ల ఇంజిన్ ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. మరమ్మతు ఖర్చులు ఆదా అవుతాయి.

