ఈ రైలులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఇందులోని 696 వ్యాగన్లు ఖాళీగా ఉన్నప్పటికీ మొత్తం రైలు బరువు 15,830 టన్నులుగా నమోదైంది. సాధారణంగా ఈ మార్గంలో ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే రైళ్లు 34,800 టన్నుల వరకు సరుకును తీసుకెళ్తాయి. ఖాళీగా ఉన్నప్పుడే ఇంత బరువు ఉన్న రైలును నియంత్రించడం కూడా సాధారణ విషయం కాదు. ముఖ్యంగా రైలు వేగాన్ని పెంచడం, తగ్గించడం, అవసరమైనప్పుడు సురక్షితంగా ఆపడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

