వార్నింగ్ బెల్స్ ఏంటీ..?: వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు ఛాతీ నొప్పి, ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, లేదా అసౌకర్యం కలిగితే ముఖ్యంగా ఈ నొప్పి మీ చేయి, భుజం, వీపు, మెడ, లేదా దవడకు వ్యాపిస్తే వెంటనే వ్యాయామం ఆపేయండి. అదేవిధంగా అసాధారణమైన లేదా తీవ్రమైన ఆయాసం, తల తిరగడం, మగతగా అనిపించడం, స్పృహ కోల్పోవడం, లేదా స్పృహ కోల్పోతానేమో అనే భావనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలు కూడా డేంజర్కి సంకేతం.

