మొత్తం ఖర్చును లెక్క వేసుకోండి: కారు ధర అంటే కేవలం షోరూమ్ ధర మాత్రమే కాదు. పెట్రోల్-డీజిల్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఛార్జీలు, మెయిన్టెనెన్స్ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోండి. కారు కోసం చేసే నెలవారీ మొత్తం ఖర్చు మీ జీతంలో 20% లోపే ఉండేలా చూసుకోండి. ఇంధన వినియోగం, సర్వీసింగ్ ఖర్చుల గురించి ముందుగానే పూర్తి అవగాహన కలిగి ఉండండి. ఇలా చేయడం వల్ల మీ బడ్జెట్ స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలంలో కారును కలిగి ఉండటం, ఉపయోగించడం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.

