సెప్టెంబర్ 2026లో మారుతి సుజుకి బాలెనో కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ నెలలో ఏకంగా 25,392 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాలు 92.76 శాతం పెరిగాయి. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, సేఫ్టీ సదుపాయాలు, మంచి మైలేజీతో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారతీయ కార్ల కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.6,09,900 నుంచి ప్రారంభం కావడంతో స్టైల్, సౌకర్యం, అందుబాటు ధరలో కారు కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. మారుతి సుజుకి బాలెనో తన ప్రత్యేకమైన లిక్విడ్ ఫ్లో డిజైన్, ఆకర్షణీయమైన బాడీ లైన్లు, స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆధునిక ఫ్రంట్ డిజైన్, ప్రత్యేకమైన లైటింగ్, గాలిని సులభంగా చీల్చుకుంటూ వెళ్లేలా రూపొందించిన ఆకృతి కారుకు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. (image: Maruti Suzuki)

