ప్రభన్యూస్

Pension Scheme: ఆ పెన్షన్ పథకంలో ఉన్నవారికి కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ | NPS Subscribers Can Now Manage Pension Accounts Through One Digital Platform | బిజినెస్


Last Updated:

Pension Scheme | ఎన్‌పీఎస్ ఖాతాదారులకు పీఎఫ్‌ఆర్‌డీఏ గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షన్ ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, ఖాతాను నిర్వహించడం వంటి సేవలన్నీ ఒకే చోట పొందేందుకు ‘ఎన్‌పీఎస్ సెంట్రల్’ అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఖాతాదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

Pension Scheme: ఆ పెన్షన్ పథకంలో ఉన్నవారికి  కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ప్రతీకాత్మక చిత్రం)
Pension Scheme: ఆ పెన్షన్ పథకంలో ఉన్నవారికి కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ప్రతీకాత్మక చిత్రం)

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతాదారులకు పెన్షన్ ఖాతా నిర్వహణ మరింత సులభం కానుంది. ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, పెన్షన్ ఖాతాకు సంబంధించిన సేవలను పొందడం కోసం ఇకపై వేర్వేరు ప్లాట్‌ఫామ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు పెన్షన్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ (PFRDA) ‘ఎన్‌పీఎస్ సెంట్రల్’ పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 1న ఎన్‌పీఎస్ దివస్ సందర్భంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పీఎఫ్‌ఆర్‌డీఏ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో పనిచేసే మూడు సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీలు (సీఆర్‌ఏలు) కలిసి ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశాయి. వీటే దీని నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటాయి.

ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో పెన్షన్ ఖాతాలకు సంబంధించిన సేవలు అందించేందుకు సీఆర్‌ఏలు, పెన్షన్ ఫండ్స్, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీలు) వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా ఖాతాదారులు తమకు అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. పెన్షన్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ఖాతాదారులకు అనుకూలంగా డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రధాన లక్ష్యం. ఎన్‌పీఎస్‌కు సంబంధించిన వివిధ సేవల కోసం వేర్వేరు వ్యవస్థలను ఉపయోగించాల్సిన అవసరాన్ని తగ్గించి, ఒకే చోట సేవలు పొందేలా ఇది ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Smartwatch Offer: రూ.10 వేల స్మార్ట్‌వాచ్ ఆఫర్‌లో రూ.999కే… 2.01 ఇంచ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 7 రోజుల బ్యాటరీ

ఎన్‌పీఎస్ సెంట్రల్ ద్వారా ‘ఎన్‌పీఎస్ స్వాస్థ్య’ పథకంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ప్రత్యేకంగా పెట్టుబడుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. దీంతో పెన్షన్ సేవలతో పాటు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలను కూడా విస్తృత డిజిటల్ వ్యవస్థలో భాగంగా పొందే అవకాశం కలుగుతుంది. ఎన్‌పీఎస్ పరిధిలోని ఇతర సంస్థలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలతో కూడా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల ఆయా సంస్థలు తమ సొంత ఛానళ్ల ద్వారా కూడా ఎన్‌పీఎస్ సేవలను ఒకే విధంగా అందించగలవని పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 5:03 pm Digital Edition : Prabhanews
Pension Scheme: ఆ పెన్షన్ పథకంలో ఉన్నవారికి కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ | NPS Subscribers Can Now Manage Pension Accounts Through One Digital Platform | బిజినెస్

Last Updated:Oct 19, 2026 5:00 PM ISTPension Scheme | ఎన్‌పీఎస్ ఖాతాదారులకు పీఎఫ్‌ఆర్‌డీఏ గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షన్ ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, ఖాతాను నిర్వహించడం వంటి సేవలన్నీ ఒకే చోట పొందేందుకు 'ఎన్‌పీఎస్ సెంట్రల్' అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఖాతాదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.Pension Scheme: ఆ పెన్షన్ పథకంలో ఉన్నవారికి కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ప్రతీకాత్మక చిత్రం)నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతాదారులకు పెన్షన్ ఖాతా నిర్వహణ మరింత సులభం కానుంది. ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, పెన్షన్ ఖాతాకు సంబంధించిన సేవలను పొందడం కోసం ఇకపై వేర్వేరు ప్లాట్‌ఫామ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు పెన్షన్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ (PFRDA) 'ఎన్‌పీఎస్ సెంట్రల్' పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 1న ఎన్‌పీఎస్ దివస్ సందర్భంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పీఎఫ్‌ఆర్‌డీఏ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో పనిచేసే మూడు సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీలు (సీఆర్‌ఏలు) కలిసి ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశాయి. వీటే దీని నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటాయి.ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో పెన్షన్ ఖాతాలకు సంబంధించిన సేవలు అందించేందుకు సీఆర్‌ఏలు, పెన్షన్ ఫండ్స్, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీలు) వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా ఖాతాదారులు తమకు అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. పెన్షన్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ఖాతాదారులకు అనుకూలంగా డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రధాన లక్ష్యం. ఎన్‌పీఎస్‌కు సంబంధించిన వివిధ సేవల కోసం వేర్వేరు వ్యవస్థలను ఉపయోగించాల్సిన అవసరాన్ని తగ్గించి, ఒకే చోట సేవలు పొందేలా ఇది ఉపయోగపడుతుంది.ఇది కూడా చదవండి: Smartwatch Offer: రూ.10 వేల స్మార్ట్‌వాచ్ ఆఫర్‌లో రూ.999కే... 2.01 ఇంచ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 7 రోజుల బ్యాటరీఎన్‌పీఎస్ సెంట్రల్ ద్వారా 'ఎన్‌పీఎస్ స్వాస్థ్య' పథకంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ప్రత్యేకంగా పెట్టుబడుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు, సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. దీంతో పెన్షన్ సేవలతో పాటు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలను కూడా విస్తృత డిజిటల్ వ్యవస్థలో భాగంగా పొందే అవకాశం కలుగుతుంది. ఎన్‌పీఎస్ పరిధిలోని ఇతర సంస్థలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలతో కూడా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల ఆయా సంస్థలు తమ సొంత ఛానళ్ల ద్వారా కూడా ఎన్‌పీఎస్ సేవలను ఒకే విధంగా అందించగలవని పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడించింది.మరింత చదవండి

Source link