మద్యం జీవక్రియ ప్రక్రియలో ‘రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్’ (reactive oxygen species) ఏర్పడవచ్చు. ఇవి శరీరంలోని కణాలు, DNA, ప్రోటీన్లు, కొవ్వులకు హాని కలిగిస్తాయి. మద్యపానం శరీరంలో విటమిన్-A (Vitamin A), B-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్లు-C, D, E, అలాగే ఫోలేట్ , కెరోటినాయిడ్ల వంటి పోషకాల శోషణకు , వినియోగానికి ఆటంకం కలిగిస్తుంది. శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. మద్యం సేవించడం వల్ల నోరు , గొంతు ప్రభావితమవుతాయి. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

