న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రాయితీ కోసం రూ.1,772 కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.2,767 కోట్లకు పెంచారు. ఈ నిధుల పెంపుతో సుమారు 45,79,120 ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందనుంది. గతంలో కేవలం 24.79 లక్షల వాహనాలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది.
