దీపావళి అంటేనే దీపాల పండుగ. వెలుగులు, ఆనందం, ఐశ్వర్యానికి ప్రతీకగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి సమయంలో ప్రతి ఇంటిని ఆకాశ దీపాలు, రంగురంగుల ముగ్గులు, మట్టి ప్రమిదలతో అందంగా అలంకరిస్తారు. హిందూ సంప్రదాయంలో మట్టి దీపాలకు, నూనె లేదా నెయ్యితో వెలిగించే వత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి గడపపై, బాల్కనీలో, కిటికీల దగ్గర, ఆవరణలో వరుసగా దీపాలు వెలిగిస్తే ఇల్లు ఎంతో అందంగా కనిపిస్తుంది. దీపాల వెలుగు ఇంట్లోని ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తిని తీసుకొస్తుందని మన పెద్దలు నమ్ముతారు.

