ప్రభన్యూస్

మా ప్రాణాలైనా పోవాలి, లేదంటే పరిష్కారమైనా రావాలి.. షిరాజ్‌ మెహదీ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘ఓ అందాల రాక్షసీ’ సినిమా థియేటర్ల సమస్య ఇప్పుడు పోరాటం నుంచి యుద్ధంగా మారిందని ఆ చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాత షిరాజ్‌ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

News18
News18

‘ఓ అందాల రాక్షసీ’ సినిమా థియేటర్ల సమస్య ఇప్పుడు పోరాటం నుంచి యుద్ధంగా మారిందని ఆ చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాత షిరాజ్‌ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాకు థియేటర్లు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఒక సినిమాను చంపడం అంటే అందులో పనిచేసిన వందల మంది జీవితాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా ఒక్కరిది కాదని, చిన్న బడ్జెట్‌ చిత్రాల సమస్యలన్నింటికీ ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. అవసరమైతే వంద ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, ధర్నాలు నిర్వహిస్తామని మరోసారి హెచ్చరించారు.

పీవీఆర్‌, ఐనాక్స్‌, ఏషియన్‌ ఫిల్మ్స్‌ సంస్థలకు థియేటర్లు కేటాయించడం లేదంటూ ఇప్పటికే నోటీసులు పంపించామని, ఫిల్మ్‌ ఛాంబర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఛాంబర్‌ అధ్యక్షుడు మారడంతో న్యాయపరమైన ప్రక్రియను తిరిగి ప్రారంభించాల్సి వస్తోందన్నారు. సినిమా ఆడియో, ఓటీటీ, శాటిలైట్‌, డబ్బింగ్‌, ఓవర్సీస్‌ హక్కులతో పాటు థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.

తెలంగాణలో తెలుగు చిత్ర పరిశ్రమ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధిపత్యం కొనసాగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రాంతంలో స్థానిక సినీ నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో థియేటర్లు మూతపడటం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడం వంటి పరిణామాలను గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో స్థానికులకు అన్యాయం జరగడాన్ని సహించబోమని హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా పలుమార్లు తెలియజేశామని, నోటీసులు పంపించామని పేర్కొన్నారు. సమస్య తెలిసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలను సమీకరించి ఆందోళనలు చేపడతామని, తెలంగాణ బంద్‌కు కూడా వెనుకాడబోమని ప్రకటించారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ వ్యవహారశైలితోపాటు యూట్యూబ్‌, ఈఎఫ్‌ఓ మాఫియాపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘మా ప్రాణాలైనా పోవాలి.. లేదంటే మా సినిమాకు పరిష్కారమైనా రావాలి. ఇది ఒక్క సినిమా సమస్య కాదు.. తెలంగాణలో చిన్న సినిమాల భవిష్యత్తుకు సంబంధించిన యుద్ధం. మంచిగా చెబితే వినడం లేదు.. త్వరలో మా పోరాటం ఏమిటో చూపిస్తాం. ఇది మా ప్రాంతం.. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాం’’ అంటూ షిరాజ్‌ మెహదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. చివరగా ‘జై తెలంగాణ.. జై హింద్‌’ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 4:43 pm Digital Edition : Prabhanews
మా ప్రాణాలైనా పోవాలి, లేదంటే పరిష్కారమైనా రావాలి.. షిరాజ్‌ మెహదీ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 05, 2026 4:43 PM IST‘ఓ అందాల రాక్షసీ’ సినిమా థియేటర్ల సమస్య ఇప్పుడు పోరాటం నుంచి యుద్ధంగా మారిందని ఆ చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాత షిరాజ్‌ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. News18‘ఓ అందాల రాక్షసీ’ సినిమా థియేటర్ల సమస్య ఇప్పుడు పోరాటం నుంచి యుద్ధంగా మారిందని ఆ చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాత షిరాజ్‌ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాకు థియేటర్లు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఒక సినిమాను చంపడం అంటే అందులో పనిచేసిన వందల మంది జీవితాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా ఒక్కరిది కాదని, చిన్న బడ్జెట్‌ చిత్రాల సమస్యలన్నింటికీ ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. అవసరమైతే వంద ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, ధర్నాలు నిర్వహిస్తామని మరోసారి హెచ్చరించారు.పీవీఆర్‌, ఐనాక్స్‌, ఏషియన్‌ ఫిల్మ్స్‌ సంస్థలకు థియేటర్లు కేటాయించడం లేదంటూ ఇప్పటికే నోటీసులు పంపించామని, ఫిల్మ్‌ ఛాంబర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఛాంబర్‌ అధ్యక్షుడు మారడంతో న్యాయపరమైన ప్రక్రియను తిరిగి ప్రారంభించాల్సి వస్తోందన్నారు. సినిమా ఆడియో, ఓటీటీ, శాటిలైట్‌, డబ్బింగ్‌, ఓవర్సీస్‌ హక్కులతో పాటు థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.తెలంగాణలో తెలుగు చిత్ర పరిశ్రమ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధిపత్యం కొనసాగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రాంతంలో స్థానిక సినీ నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో థియేటర్లు మూతపడటం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడం వంటి పరిణామాలను గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో స్థానికులకు అన్యాయం జరగడాన్ని సహించబోమని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా పలుమార్లు తెలియజేశామని, నోటీసులు పంపించామని పేర్కొన్నారు. సమస్య తెలిసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలను సమీకరించి ఆందోళనలు చేపడతామని, తెలంగాణ బంద్‌కు కూడా వెనుకాడబోమని ప్రకటించారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ వ్యవహారశైలితోపాటు యూట్యూబ్‌, ఈఎఫ్‌ఓ మాఫియాపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.‘‘మా ప్రాణాలైనా పోవాలి.. లేదంటే మా సినిమాకు పరిష్కారమైనా రావాలి. ఇది ఒక్క సినిమా సమస్య కాదు.. తెలంగాణలో చిన్న సినిమాల భవిష్యత్తుకు సంబంధించిన యుద్ధం. మంచిగా చెబితే వినడం లేదు.. త్వరలో మా పోరాటం ఏమిటో చూపిస్తాం. ఇది మా ప్రాంతం.. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాం’’ అంటూ షిరాజ్‌ మెహదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. చివరగా ‘జై తెలంగాణ.. జై హింద్‌’ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.మరింత చదవండి

Source link