ప్రభన్యూస్

Payal Rajput: అన్నం పెట్టిన ఇండస్ట్రీకే వెన్నుపోటు పొడుస్తారా? రాధికా ఆప్టేకు స్ట్రాంగ్ కౌంటర్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌పై ప్రముఖ నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వివరాల్లోకి పోతే..

News18
News18

టాలీవుడ్‌పై ప్రముఖ నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్‌పై అటు నెటిజన్లు, ఇటు సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వివాదంలోకి తాజాగా టాలీవుడ్ హీరోయిన్, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఎంటర్ అయ్యారు. తెలుగు చిత్రసీమ పట్ల తనకున్న ప్రేమను, గౌరవాన్ని చాటుకుంటూనే.. పరోక్షంగా రాధికా ఆప్టేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా పనిచేయడం తనకెంతో గర్వకారణమని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. “ఒక నటిగా నా కెరీర్‌ను నిలబెట్టింది, నాకు ఇంతటి గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ, ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది టాలీవుడ్ మాత్రమే. నన్ను ఆదరించి, స్టార్‌గా నిలబెట్టిన ఈ పరిశ్రమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. టాలీవుడ్‌కు ఎల్లప్పుడూ అండగా నిలబడతాను,” అని పాయల్ స్పష్టం చేశారు.

అన్నం పెట్టిన ఇండస్ట్రీకి వెన్నుపోటు పొడుస్తారా?

ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకుండానే రాధికా ఆప్టే తీరును పాయల్ తీవ్రంగా తప్పుబట్టారు. “ఒక ఇండస్ట్రీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలు పొంది, ఇక్కడే కెరీర్‌ను నిర్మించుకుని.. ఆ తర్వాత అదే ఇండస్ట్రీపై విషం కక్కడం, నెగెటివ్ గా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?” అని పాయల్ ప్రశ్నించారు. అన్నం పెట్టిన పరిశ్రమకు వెన్నుపోటు పొడిచేలా మాట్లాడే వ్యక్తుల మనస్తత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, తనకెంతో ఇచ్చిన పరిశ్రమపై తానెప్పటికీ నెగెటివ్‌గా మాట్లాడనని ఆమె తేల్చి చెప్పారు.

మరింత వేడెక్కిన వివాదం:

గతంలో బాలకృష్ణ సరసన ‘లెజెండ్’, ‘రక్త చరిత్ర’ వంటి సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే, టాలీవుడ్‌లో పురుషాధిక్యత ఎక్కువని, అక్కడ వాతావరణం తనకు నచ్చలేదని పలుమార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఘాటుగా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఎంతో మంది పరభాషా హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందని, ఇక్కడి నుంచి వెళ్లిపోయి విమర్శించడం సరికాదని ఆయన చురకలంటించారు. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ కూడా అదే తరహాలో రియాక్ట్ కావడంతో టాలీవుడ్‌లో ఈ వివాదం మరింత వేడెక్కింది. పాయల్ చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో విశేష మద్దతు లభిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 3:12 pm Digital Edition : Prabhanews
Payal Rajput: అన్నం పెట్టిన ఇండస్ట్రీకే వెన్నుపోటు పొడుస్తారా? రాధికా ఆప్టేకు స్ట్రాంగ్ కౌంటర్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 05, 2026 3:10 PM ISTటాలీవుడ్‌పై ప్రముఖ నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వివరాల్లోకి పోతే.. News18టాలీవుడ్‌పై ప్రముఖ నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్‌పై అటు నెటిజన్లు, ఇటు సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వివాదంలోకి తాజాగా టాలీవుడ్ హీరోయిన్, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఎంటర్ అయ్యారు. తెలుగు చిత్రసీమ పట్ల తనకున్న ప్రేమను, గౌరవాన్ని చాటుకుంటూనే.. పరోక్షంగా రాధికా ఆప్టేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా పనిచేయడం తనకెంతో గర్వకారణమని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. "ఒక నటిగా నా కెరీర్‌ను నిలబెట్టింది, నాకు ఇంతటి గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ, ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది టాలీవుడ్ మాత్రమే. నన్ను ఆదరించి, స్టార్‌గా నిలబెట్టిన ఈ పరిశ్రమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. టాలీవుడ్‌కు ఎల్లప్పుడూ అండగా నిలబడతాను," అని పాయల్ స్పష్టం చేశారు.అన్నం పెట్టిన ఇండస్ట్రీకి వెన్నుపోటు పొడుస్తారా?ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకుండానే రాధికా ఆప్టే తీరును పాయల్ తీవ్రంగా తప్పుబట్టారు. "ఒక ఇండస్ట్రీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలు పొంది, ఇక్కడే కెరీర్‌ను నిర్మించుకుని.. ఆ తర్వాత అదే ఇండస్ట్రీపై విషం కక్కడం, నెగెటివ్ గా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?" అని పాయల్ ప్రశ్నించారు. అన్నం పెట్టిన పరిశ్రమకు వెన్నుపోటు పొడిచేలా మాట్లాడే వ్యక్తుల మనస్తత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, తనకెంతో ఇచ్చిన పరిశ్రమపై తానెప్పటికీ నెగెటివ్‌గా మాట్లాడనని ఆమె తేల్చి చెప్పారు.
Tollywood made me who I am today. I will always stand by the industry that stood by me. 🎬🔥
— Payal Rajput https://t.co/YvO6hcnDz3
— paayal rajput (@starlingpayal) November 4, 2026మరింత వేడెక్కిన వివాదం:గతంలో బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'రక్త చరిత్ర' వంటి సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే, టాలీవుడ్‌లో పురుషాధిక్యత ఎక్కువని, అక్కడ వాతావరణం తనకు నచ్చలేదని పలుమార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఘాటుగా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఎంతో మంది పరభాషా హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందని, ఇక్కడి నుంచి వెళ్లిపోయి విమర్శించడం సరికాదని ఆయన చురకలంటించారు. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ కూడా అదే తరహాలో రియాక్ట్ కావడంతో టాలీవుడ్‌లో ఈ వివాదం మరింత వేడెక్కింది. పాయల్ చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో విశేష మద్దతు లభిస్తోంది.మరింత చదవండి

Source link