ప్రభన్యూస్

Amit Shah: మోదీతో చర్చకు సిద్ధమా? రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సవాల్..! |


Last Updated:

ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చకు రావాలంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. చర్చకు సిద్ధమైతే లేఖ రాయాలని, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని బదులిచ్చారు.

News18
News18

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన విమర్శలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. గురువారం హర్యానాలోని కర్నాల్‌లో బీజేపీ నిర్వహించిన ‘లోక్‌తంత్ర బచావో, అరాజకతా హటావో’ పాదయాత్రలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసరడం కాదని, నిజంగా చర్చ జరపాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రధానికి అధికారికంగా లేఖ రాయాలని రాహుల్‌కు సూచించారు.

చర్చించడానికి తాము ఏమాత్రం వెనుకాడబోమని, ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వ్యవహారంతో పాటు ఏ అంశంపైనైనా సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.

వియత్నాం పర్యటనపై ప్రశ్నల వర్షం..

ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన వియత్నాం పర్యటనను అమిత్ షా తీవ్రంగా ఎండగట్టారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత విపక్ష నేతగా రాహుల్‌పై ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని హితవు పలికారు. సభను సజావుగా సాగనివ్వకుండా అరాజకం సృష్టించడమే కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని ఆరోపించారు.

దేశ ప్రజలు వరుసగా మూడోసారి మోదీ నాయకత్వాన్ని బలపరిచారని, రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుస ఓటములను చవిచూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పును జీర్ణించుకోలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

విదేశీ శక్తుల అండతోనే మోదీ ప్రధాని అయ్యారని, ఆర్థిక వ్యవస్థను విదేశీయులే నడిపిస్తున్నారంటూ అంతకుముందు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దమ్ముంటే ఏ వేదికపైనైనా చర్చకు రావాలంటూ మోదీకి ‘ఎక్స్’ వేదికగా రాహుల్ బహిరంగ సవాల్ విసరడం ఈ రాజకీయ దుమారానికి దారితీసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 2:38 pm Digital Edition : Prabhanews
Amit Shah: మోదీతో చర్చకు సిద్ధమా? రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సవాల్..! |

Last Updated:Nov 05, 2026 2:31 PM ISTప్రధాని మోదీతో ముఖాముఖి చర్చకు రావాలంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. చర్చకు సిద్ధమైతే లేఖ రాయాలని, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని బదులిచ్చారు.News18లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన విమర్శలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. గురువారం హర్యానాలోని కర్నాల్‌లో బీజేపీ నిర్వహించిన 'లోక్‌తంత్ర బచావో, అరాజకతా హటావో' పాదయాత్రలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసరడం కాదని, నిజంగా చర్చ జరపాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రధానికి అధికారికంగా లేఖ రాయాలని రాహుల్‌కు సూచించారు.చర్చించడానికి తాము ఏమాత్రం వెనుకాడబోమని, ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వ్యవహారంతో పాటు ఏ అంశంపైనైనా సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.వియత్నాం పర్యటనపై ప్రశ్నల వర్షం..ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన వియత్నాం పర్యటనను అమిత్ షా తీవ్రంగా ఎండగట్టారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత విపక్ష నేతగా రాహుల్‌పై ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని హితవు పలికారు. సభను సజావుగా సాగనివ్వకుండా అరాజకం సృష్టించడమే కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని ఆరోపించారు.
कांग्रेस की अराजकता व तुष्टीकरण की राजनीति अब पूरी तरह एक्सपोज हो चुकी है और देशवासी इसके ख़िलाफ सड़कों पर उतर रहे हैं। करनाल (हरियाणा) में भाजपा के 'लोकतंत्र बचाओ, अराजकता हटाओ' अभियान के तहत पदयात्रा से लाइव… https://t.co/HXuUmQHoky
— Amit Shah (@AmitShah) November 5, 2026దేశ ప్రజలు వరుసగా మూడోసారి మోదీ నాయకత్వాన్ని బలపరిచారని, రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుస ఓటములను చవిచూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పును జీర్ణించుకోలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Mr Modi, stop lying to this nation.
You became PM because of foreign help. You remain PM because of foreign help.Your financial system is fully controlled and supported by foreigners. Foreign social media fully backs you.I challenge you to an open debate about this. Any stage, any time. Come if you have the guts.You won't dare, because you are terrified of what I know about you.मोदी जी, इस देश से झूठ बोलना बंद कीजिए।आप विदेशी मदद से प्रधानमंत्री बने। और विदेशी मदद से ही प्रधानमंत्री बने हुए हैं।आपकी आर्थिक व्यवस्था पूरी तरह विदेशियों के नियंत्रण में और समर्थन से है। विदेशी सोशल मीडिया पूरी तरह आपके साथ खड़ा है।मैं आपको इस मुद्दे पर खुली बहस की चुनौती देता हूं। कोई भी मंच, किसी भी समय। हिम्मत है तो आइए।आप नहीं आएंगे, क्योंकि जो मैं आपके बारे में जानता हूं आप उससे डरते हैं।— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2026విదేశీ శక్తుల అండతోనే మోదీ ప్రధాని అయ్యారని, ఆర్థిక వ్యవస్థను విదేశీయులే నడిపిస్తున్నారంటూ అంతకుముందు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దమ్ముంటే ఏ వేదికపైనైనా చర్చకు రావాలంటూ మోదీకి 'ఎక్స్' వేదికగా రాహుల్ బహిరంగ సవాల్ విసరడం ఈ రాజకీయ దుమారానికి దారితీసింది.మరింత చదవండి

Source link