ప్రభన్యూస్

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. రాజకీయాల కోసం విద్యార్థులను వాడుకోవద్దంటూ ఎమోషనల్ పోస్ట్! |


Last Updated:

నీట్-యుజి 2026 పరీక్ష అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ దేశ యువతకు ఎక్స్ (X) వేదికగా ఒక భావోద్వేగ లేఖ రాశారు.

News18
News18

నీట్-యుజి (NEET-UG) 2026 పరీక్ష అక్రమాల నేపథ్యంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా దేశ యువతకు ఆయన ఒక భావోద్వేగ లేఖ రాశారు. మే 3న జరిగిన నీట్ పరీక్షలో తలెత్తిన పొరపాట్లను ప్రభుత్వం తక్షణమే గుర్తించి సీబీఐ విచారణకు ఆదేశించిందని తెలిపారు. సీబీఐ విచారణ, జూన్ 21న తిరిగి కొత్త పరీక్ష నిర్వహణ, ఫలితాల విడుదల వరకు ప్రతి దశలోనూ తానే స్వయంగా బాధ్యత తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడటం, వారి కలలను నెరవేర్చడం తన నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయం పేరుతో విద్యార్థుల భవిష్యత్తును కొందరు నాశనం చేయడానికి ప్రయత్నించడం తనను బాధించిందని, అందుకే ప్రధానికి లేఖ సమర్పించినట్లు తెలిపారు.

వచ్చే సంవత్సరం నుండి నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో జూన్ 21న పరీక్ష విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. జూలై 16న వచ్చిన ఫలితాల్లో పేద వర్గాల పిల్లలు అద్భుత ప్రతిభ కనబరచడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు.

dharmendra pradhan resign post

కొందరు బాధ్యతాయుత పదవుల్లో ఉండి కూడా విద్యార్థులను తప్పుదారి పట్టించడానికి చూశారని ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు, దేశంలో తలెత్తిన పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తులకు ప్రయోజనం చేకూర్చకూడదని స్పష్టం చేశారు. మన పిల్లల సమయం కోర్టు కేసులు, వివాదాల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే తాను బాధ్యతల నుండి తప్పుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు వెల్లడించారు.

తనకు మార్గదర్శనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, మంత్రివర్గ సహచరులకు, అధికారులకు ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవ తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత అని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా భగవాన్ జగన్నాథుని ఆశీస్సులతో భారతావని, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తానని లేఖలో స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 3:23 pm Digital Edition : Prabhanews
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. రాజకీయాల కోసం విద్యార్థులను వాడుకోవద్దంటూ ఎమోషనల్ పోస్ట్! |

Last Updated:Jul 25, 2026 2:47 PM ISTనీట్-యుజి 2026 పరీక్ష అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ దేశ యువతకు ఎక్స్ (X) వేదికగా ఒక భావోద్వేగ లేఖ రాశారు.News18నీట్-యుజి (NEET-UG) 2026 పరీక్ష అక్రమాల నేపథ్యంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా దేశ యువతకు ఆయన ఒక భావోద్వేగ లేఖ రాశారు. మే 3న జరిగిన నీట్ పరీక్షలో తలెత్తిన పొరపాట్లను ప్రభుత్వం తక్షణమే గుర్తించి సీబీఐ విచారణకు ఆదేశించిందని తెలిపారు. సీబీఐ విచారణ, జూన్ 21న తిరిగి కొత్త పరీక్ష నిర్వహణ, ఫలితాల విడుదల వరకు ప్రతి దశలోనూ తానే స్వయంగా బాధ్యత తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడటం, వారి కలలను నెరవేర్చడం తన నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయం పేరుతో విద్యార్థుల భవిష్యత్తును కొందరు నాశనం చేయడానికి ప్రయత్నించడం తనను బాధించిందని, అందుకే ప్రధానికి లేఖ సమర్పించినట్లు తెలిపారు.వచ్చే సంవత్సరం నుండి నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో జూన్ 21న పరీక్ష విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. జూలై 16న వచ్చిన ఫలితాల్లో పేద వర్గాల పిల్లలు అద్భుత ప్రతిభ కనబరచడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు.కొందరు బాధ్యతాయుత పదవుల్లో ఉండి కూడా విద్యార్థులను తప్పుదారి పట్టించడానికి చూశారని ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు, దేశంలో తలెత్తిన పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తులకు ప్రయోజనం చేకూర్చకూడదని స్పష్టం చేశారు. మన పిల్లల సమయం కోర్టు కేసులు, వివాదాల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే తాను బాధ్యతల నుండి తప్పుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు వెల్లడించారు.తనకు మార్గదర్శనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, మంత్రివర్గ సహచరులకు, అధికారులకు ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవ తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత అని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా భగవాన్ జగన్నాథుని ఆశీస్సులతో భారతావని, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తానని లేఖలో స్పష్టం చేశారు.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link