బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఓ భవనం పక్కనే ఉన్న ఇంటిపై కూలిపోవడంతో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా.. మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. బాధితుల్లో బొలీవియన్ మూలాలున్న కుటుంబ సభ్యులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
Source link
