ప్రభన్యూస్

Crime News: యూపీలో ఘోరం.. భార్యను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసిన భర్త.. ఎందుకంటే..! |


Last Updated:

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు భర్త. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకుని నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

Ai Gen
Ai Gen

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. చిబ్రమౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌పూర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని 30 ఏళ్ల సోనమ్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు సుఖ్‌బీర్ సింగ్ అలియాస్ మోను అదే గ్రామానికి చెందిన యువకుడితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఫోన్‌లో ఆ యువకుడితో మాట్లాడుతుండగా చూసిన భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 7 గంటల సమయంలో భార్యను గదిలోని కుర్చీకి తాళ్లతో బంధించి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఇంటి నుంచి మంటలు రావడం, లోపలి నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలు తీవ్రంగా చెలరేగడంతో గ్రామస్తులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే సోనమ్ పూర్తిగా కాలిపోయి కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించింది.

ఘటనా స్థలం పరిశీలించిన పోలీసులు

న్యూస్18 హిందీ కథనం ప్రకారం.. సోనమ్, సుఖ్‌బీర్ దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సుఖ్‌బీర్ హర్యానాలోని హిసార్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.

ఈ అమానవీయ హత్య అనంతరం నిందితుడు తన ఇద్దరు చిన్నారులను తీసుకుని గ్రామం నుంచి పారిపోయాడు. మృతదేహం అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న సుఖ్‌బీర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 7:22 pm Digital Edition : Prabhanews
Crime News: యూపీలో ఘోరం.. భార్యను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసిన భర్త.. ఎందుకంటే..! |

Last Updated:Nov 05, 2026 6:49 PM ISTఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు భర్త. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకుని నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.Ai Genఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. చిబ్రమౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌పూర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని 30 ఏళ్ల సోనమ్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు సుఖ్‌బీర్ సింగ్ అలియాస్ మోను అదే గ్రామానికి చెందిన యువకుడితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఫోన్‌లో ఆ యువకుడితో మాట్లాడుతుండగా చూసిన భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 7 గంటల సమయంలో భార్యను గదిలోని కుర్చీకి తాళ్లతో బంధించి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఘాతుకానికి పాల్పడ్డాడు.ఇంటి నుంచి మంటలు రావడం, లోపలి నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలు తీవ్రంగా చెలరేగడంతో గ్రామస్తులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే సోనమ్ పూర్తిగా కాలిపోయి కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించింది.
Kannauj: A 30-year-old woman, Sonam Rathore, was allegedly tied to a chair, doused with petrol and burnt to death by her husband in Chhibramau over suspected infidelity. The accused, Sukhveer Singh alias Monu, fled with their children. https://t.co/rZTCC892tB
— TOI Lucknow (@TOILucknow) November 5, 2026ఘటనా స్థలం పరిశీలించిన పోలీసులున్యూస్18 హిందీ కథనం ప్రకారం.. సోనమ్, సుఖ్‌బీర్ దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సుఖ్‌బీర్ హర్యానాలోని హిసార్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.ఈ అమానవీయ హత్య అనంతరం నిందితుడు తన ఇద్దరు చిన్నారులను తీసుకుని గ్రామం నుంచి పారిపోయాడు. మృతదేహం అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న సుఖ్‌బీర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.మరింత చదవండి

Source link