2005లో వెండి వస్తువులకు కూడా హాల్మార్కింగ్ విధానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం భారత్లో బంగారం, వెండి రెండింటికీ ఈ విధానం వర్తిస్తోంది. బంగారు ఆభరణాలకు 2021 జూన్ 23 నుంచి 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేశారు. ఆ తర్వాత బంగారం స్వచ్ఛతను పరీక్షించి హాల్మార్క్ వేసే కేంద్రాల సంఖ్య పెరగడంతో ఈ విధానం ప్రస్తుతం 392 జిల్లాలకు విస్తరించింది. IS 1417 ప్రమాణం ప్రకారం బంగారు ఆభరణాలకు మొత్తం 7 రకాల క్యారెట్లలో హాల్మార్కింగ్ చేస్తున్నారు. అవి 9 క్యారెట్లు – 375, 14 క్యారెట్లు – 585, 18 క్యారెట్లు – 750, 20 క్యారెట్లు – 833, 22 క్యారెట్లు – 916, 23 క్యారెట్లు – 958, 24KS – 995. ఇక్కడ పేర్కొన్న సంఖ్యలు ప్రతి 1,000 భాగాల్లో ఎంత బంగారం ఉందో తెలియజేస్తాయి. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారంపై 916 అని ఉంటే, అందులో 1,000 భాగాలకు 916 భాగాలు బంగారం ఉందని అర్థం. వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రస్తుతం స్వచ్ఛందంగానే ఉంది. అయితే BIS హాల్మార్కింగ్ విధానం కింద హాల్మార్క్ చేయించిన వెండి వస్తువులపై 2025 సెప్టెంబర్ 1 నుంచి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) కోడ్ తప్పనిసరిగా ఉండాలి. HUID అంటే ప్రతి హాల్మార్క్ చేసిన ఆభరణానికి ఇచ్చే ప్రత్యేకమైన ఆరు అంకెలు, అక్షరాలతో కూడిన కోడ్. ఈ కోడ్ ద్వారా ఆభరణానికి సంబంధించిన వివరాలను గుర్తించవచ్చు. సవరించిన IS 2112:2025 ప్రమాణం ప్రకారం వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువులకు 8 రకాల స్వచ్ఛత స్థాయిల్లో హాల్మార్కింగ్ చేయవచ్చు. అవి 800 (800.0), 835 (835.0), 900 (900.0), 925 (925.0), 958 (958.0), 970 (970.0), 990 (990.0), 999 (999.0). (ప్రతీకాత్మక చిత్రం)

