ప్రభన్యూస్

Chittoor: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. రూ. 38 లక్షలతో జాబ్ కన్సల్టెంట్ పరార్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

2024లో పెద్దపంజాణి మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన గడ్డం అనిల్‌కుమార్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను బెంగళూరులో ఒక ప్రముఖ జాబ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నానని, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనిల్‌కుమార్ నమ్మబలికాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Chittoor: సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, నిరుద్యోగ యువత నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఒక నకిలీ జాబ్ కన్సల్టెంట్‌పై చిత్తూరు జిల్లా పెద్దపంజాణి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ. 38 లక్షలు వసూలు చేసి సదరు వ్యక్తి పరారయ్యాడు.

కన్సల్టెంట్‌గా నమ్మించి.. వసూళ్లకు తెరలేపి

ఈనాడు కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శివకుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, ఆన్‌లైన్ ద్వారా సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తుండేవారు. ఈ క్రమంలో 2024లో పెద్దపంజాణి మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన గడ్డం అనిల్‌కుమార్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను బెంగళూరులో ఒక ప్రముఖ జాబ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నానని, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనిల్‌కుమార్ నమ్మబలికాడు.

అనిల్‌కుమార్ మాటలను నిజమని నమ్మిన శివకుమార్, తన వద్ద శిక్షణ పొందుతున్న 20 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకుల వివరాలను అతనికి తెలిపాడు. ఉద్యోగాల కోసం వారి నుండి వసూలు చేసిన మొత్తం రూ. 38 లక్షలను 2025 నుంచి అనిల్‌కుమార్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.

మూడు నెలలకే ఊడిన ఉద్యోగాలు.. బయటపడ్డ మోసం

డబ్బులు తీసుకున్న తర్వాత అనిల్‌కుమార్ ముగ్గురు యువతీ యువకులకు ఐటీబీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాడు. అయితే, జాయిన్ అయిన కేవలం మూడు నెలలకే వారు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. అటు కంపెనీ వారు జీతాలు ఇవ్వకపోవడం, ఇటు అనిల్‌కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు.

డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసానికి పాల్పడ్డాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెద్దపంజాణి ఎస్సై సురేష్‌బాబు బుధవారం రాత్రి నిందితుడు గడ్డం అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 9:03 am Digital Edition : Prabhanews
Chittoor: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. రూ. 38 లక్షలతో జాబ్ కన్సల్టెంట్ పరార్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 5:46 AM IST2024లో పెద్దపంజాణి మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన గడ్డం అనిల్‌కుమార్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను బెంగళూరులో ఒక ప్రముఖ జాబ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నానని, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనిల్‌కుమార్ నమ్మబలికాడు.ప్రతీకాత్మక చిత్రంChittoor: సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, నిరుద్యోగ యువత నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఒక నకిలీ జాబ్ కన్సల్టెంట్‌పై చిత్తూరు జిల్లా పెద్దపంజాణి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ. 38 లక్షలు వసూలు చేసి సదరు వ్యక్తి పరారయ్యాడు.కన్సల్టెంట్‌గా నమ్మించి.. వసూళ్లకు తెరలేపిఈనాడు కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శివకుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, ఆన్‌లైన్ ద్వారా సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తుండేవారు. ఈ క్రమంలో 2024లో పెద్దపంజాణి మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన గడ్డం అనిల్‌కుమార్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను బెంగళూరులో ఒక ప్రముఖ జాబ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నానని, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనిల్‌కుమార్ నమ్మబలికాడు.అనిల్‌కుమార్ మాటలను నిజమని నమ్మిన శివకుమార్, తన వద్ద శిక్షణ పొందుతున్న 20 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకుల వివరాలను అతనికి తెలిపాడు. ఉద్యోగాల కోసం వారి నుండి వసూలు చేసిన మొత్తం రూ. 38 లక్షలను 2025 నుంచి అనిల్‌కుమార్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.మూడు నెలలకే ఊడిన ఉద్యోగాలు.. బయటపడ్డ మోసండబ్బులు తీసుకున్న తర్వాత అనిల్‌కుమార్ ముగ్గురు యువతీ యువకులకు ఐటీబీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాడు. అయితే, జాయిన్ అయిన కేవలం మూడు నెలలకే వారు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. అటు కంపెనీ వారు జీతాలు ఇవ్వకపోవడం, ఇటు అనిల్‌కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు.డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసానికి పాల్పడ్డాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెద్దపంజాణి ఎస్సై సురేష్‌బాబు బుధవారం రాత్రి నిందితుడు గడ్డం అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link