Sugar cleaning hacks: వంటింట్లో ఉండే పంచదారతో.. జిడ్డు మరకల నుంచి తుప్పు క్లీనింగ్ వరకు ఎన్నో ఉపయోగాలు! |
స్వీట్లు, పరమాన్నం, పాయసం వంటి వంటకాలు చేయాలన్నా, ఉదయం లేదా సాయంత్రం టీ, కాఫీ, జ్యూస్‌లలో తీపి కోసం వాడాలన్నా పంచదార చాలా ముఖ్యమైన పదార్థం. అయితే చక్కెరను కేవలం వంటల్లోనే ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కొన్ని చిన్నచిన్న పనులకు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చేతులకు అంటుకున్న గ్రీజు, నూనె వంటి జిడ్డును తొలగించడానికి చక్కెరను స్క్రబ్‌లా ఉపయోగించే పద్ధతి ఉంది. చక్కెర రేణువులు మృదువైన స్క్రబ్‌లా పనిచేస్తూ సబ్బుతో కలిసి చేతులపై ఉన్న…
