ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ కస్టమర్‌కు నగదు రాకపోయినా, అతని ఖాతా నుంచి రూ.10,000 డెబిట్ అయ్యాయి. ఈ ఘటనలో బ్యాంకు సేవల్లో లోపం ఉందని తేల్చిన కేరళ వినియోగదారుల ఫోరం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కస్టమర్‌కు రూ.10,000 తిరిగి చెల్లించాలని, అదనంగా రూ.5,000 పరిహారం ఇవ్వాలని ఆదేశించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం, ఏటీఎం నుంచి ఎలాంటి నగదు రాలేదు. కానీ అతని ఖాతా నుంచి రూ.10,000 తగ్గిపోయాయి. ఈ విషయంపై బ్యాంకుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా డబ్బులు తిరిగి జమ చేయలేదని ఆయన తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సేవల్లో లోపం ఉందని కేరళలోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తేల్చింది. ఏటీఎం నుంచి నిజంగా రూ.10,000 నగదు తీసుకున్నట్లు నిరూపించడంలో బ్యాంకు విఫలమైందని పేర్కొంది. కస్టమర్ ఖాతా నుంచి డెబిట్ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, మానసిక ఇబ్బందులకు పరిహారంగా రూ.5,000 ఇవ్వాలని ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)

