Last Updated:
Adult Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీల యాప్స్ పేరుతో కనిపించే కొన్ని ప్రకటనలు, లింక్‌ల ద్వారా ప్రమాదకరమైన మాల్వేర్ ఫోన్లోకి చొరబడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, ఈ సాంకేతికత ఎంత సౌకర్యంగా ఉంటుందో, సైబర్ నేరగాళ్ల వల్ల అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. తాజాగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను బురిడీ కొట్టించి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల యాప్‌ల (Adult Apps) ముసుగులో కొన్ని ప్రమాదకరమైన హానికర యాప్‌లు చలామణి అవుతున్నాయని, ఆండ్రాయిడ్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

