Last Updated:
చేతిలో నగదు లేకపోయినా చెల్లింపులు ఆగడం లేదు.. దేశంలో UPI వినియోగం ఏ స్థాయికి చేరిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి! ఆగస్టులో UPI లావాదేవీలు ఏకంగా 24.51 బిలియన్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించాయి. అంటే రోజుకు సగటున దాదాపు 79 కోట్ల లావాదేవీలు జరిగాయి. జూలైతో పోలిస్తే 3.6 శాతం, గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న మొత్తాల చెల్లింపుల నుంచి పెద్ద లావాదేవీల వరకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)పై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో 2026 ఆగస్టులో UPI లావాదేవీలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం, జూలైలో నమోదైన 23.66 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఆగస్టులో ఈ సంఖ్య 24.51 బిలియన్లకు పెరిగింది.

