Last Updated:
బాసింగ బలాలే సాంగ్ ఫేమ్ ఈశ్వర్ సాయిపై పోలీస్ కేసు నమోదైంది. తన తోటి డాన్సర్ మాధురి రాథోడ్ ఈ కేసు ఫైల్ చేయడం పెను సంచలనంగా మారింది.
తెలంగాణ జానపద గీతాలకు యూట్యూబ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫోక్ సాంగ్స్ ద్వారా ఎంతో మంది యువ కళాకారులు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు. అలా ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ తో భారీ పాపులారిటీని దక్కించుకున్న పాపులర్ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకున్నాయి. తన తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ తో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఈశ్వర్ సాయిపై తాజాగా పోలీసు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.

