Last Updated:
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమా టార్టాయిస్. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో ఎవరు అనేది నిన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సస్పెన్స్ కు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు ?, ఆయన సినిమా ఏంటి ? అనేది అనౌన్స్ చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన నటిస్తున్న కొత్త సినిమా “టార్టాయిస్” అంటూ మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “టార్టాయిస్” సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. “టార్టాయిస్” సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు.

