Last Updated:
బజాజ్ పల్సర్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొత్త పల్సర్ 150, 125 బైక్‌లు విడుదలయ్యాయి. కొత్త ఇంజిన్, గేర్‌బాక్స్, మోనోషాక్ సస్పెన్షన్, 5-అంగుళాల టీఎఫ్టీ కన్సోల్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భారతీయ బైక్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బజాజ్ పల్సర్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో కొత్త పల్సర్ 150, పల్సర్ 125 బైక్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త ఇంజిన్, గేర్‌బాక్స్, మోనోషాక్ సస్పెన్షన్, 5-అంగుళాల టీఎఫ్టీ కన్సోల్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ లాంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పల్సర్‌కి ప్రత్యేకమైన పెర్ఫార్మెన్స్, స్టైల్, రోడ్ ప్రెజెన్స్ మాత్రం అలాగే ఉంచారు. ప్రపంచంలో అత్యంత విలువైన టూ-వీలర్, త్రీ-వీలర్ కంపెనీగా ఉన్న బజాజ్ ఆటో లిమిటెడ్ కొత్త పల్సర్ 150, పల్సర్ 125ను ఈ రోజు ఆవిష్కరించింది. కొత్త ఫీచర్లు, టెక్నాలజీలను జోడించినా.. పల్సర్ బ్రాండ్‌కు ప్రత్యేకంగా ఉన్న గుర్తింపు, స్టైల్‌ను మాత్రం అలాగే కొనసాగించింది.

