చక్కెర ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చక్కెర నిల్వలపై పరిమితులు విధిస్తూ, ఏ చక్కెర వ్యాపారి కూడా 30 రోజులకు మించి నిల్వ ఉంచకూడదని ఆదేశించిందని పీటీఐ కథనం వెల్లడించింది. అలాగే ఒకేసారి 4,000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026 నవంబర్ 30 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర వస్తువుల చట్టం, 1955లోని సెక్షన్ 3, అలాగే షుగర్ (కంట్రోల్) ఆర్డర్, 2025 కింద ఈ పరిమితులు విధించింది. (ప్రతీకాత్మక చిత్రం)

